క్రిస్మస్ పార్టీలో ‘వెరైటీ’ కోరుతున్న జర్మన్లు

Update: 2015-12-11 22:30 GMT
ప్రాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ పార్టీ ఎంత సందడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబరు నెల కోసం చాలామంది ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. క్రిస్మస్ పార్టీని వారాల తరబడి చేసుకునే వారు చాలామందే ఉంటారు. క్రిస్మస్.. ఆ వెంటనే వచ్చే న్యూ ఇయర్ వరకూ చాలా దేశాల్లో పండుగ వాతావరణ నెలకొని ఉంటుంది. ఇదే తరహా జోరు జర్మనీలోనూ కనిపిస్తుంది. క్రిస్మస్ పార్టీని ఎలా ఎంజాయ్ చేయాలంటూ పలువురు జర్మన్ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తే.. వారు చెప్పిన సమాధానం వింటే కాస్తంత ఆశ్చర్యం కలిగించక మానదు.

క్రిస్మస్ పార్టీని విభిన్నంగా చేసుకోవాలని భావిస్తున్న జర్మన్లు.. అందులో సెక్స్ ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాదు.. ఆఫీసుల్లో చేసే క్రిస్మస్ పార్టీలో సెక్స్ ఉంటే బాగుంటుందన్న కోర్కెను వెల్లడించిన వారు.. తమ ఫాంటసీల చిట్టా విప్పారు. ఆఫీసులో క్రిస్మస్ పార్టీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తున్నారని అడిగితే.. ఆ పార్టీలో సెక్స్ చేయాలని 39 శాతం మంది చెప్పటం గమనార్హం.

అంతేకాదు.. రోజూ మీటింగ్స్ జరిగే బోర్డ్ మీటింగ్ రూమ్ టేబుల్స్ మీదా.. స్టేషనరీ కబోర్డుల్లో సెక్స్ చేయాలని ఉందన్న వారు.. బాస్ రూమ్ లో సెక్స్ చేయాలన్న చిత్రమైన అభిలాషను వ్యక్తం చేశారట. ఇక.. రోజూ పని చేసే ఆఫీస్ డెస్క్ దగ్గర సెక్స్ చేయాలని 15 శాతం మంది కోరుకున్నారట. సాధ్యం ఫాంటసీల మీద చాలానే ఆసక్తి ఉంటుందని.. దానికి నిదర్శనమే క్రిస్మస్ పార్టీ సందర్భంగా ఆఫీసుల్లో సెక్స్ చేయాలని చెప్పటమేనని జర్మన్ల కోర్కెల్ని విశ్లేషిస్తున్న వారు చెబుతున్నారు. ఆఫీసుల్లో జరిగే పండుగ పార్టీ రొమాంటిక్ గా ఉండాలన్నది జర్మన్ల ఆశలా కనిపిస్తోంది కదా.
Tags:    

Similar News