ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను కంట్రోల్ చేసే మెడిసిన్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని దేశాలూ ఇప్పుడు అదే పనిలో ఉన్నాయి. వైరస్ కు విరుగుడు తయారైనట్లు రూమర్లు సైతం కోరోనాతో పాటే అన్ని దేశాల్లో షికార్లు చేస్తున్నాయి. రూమర్ల సంగతి ఎలాగున్నా - ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు నిజంగా మందు కనిపెడితే వారే కింగులు. ప్రపంచదేశాలన్నీ వారి ఎదుట సాష్టాంగపడతాయి. వైన్ షాపుల ముందు మందుబాబులు నిలుచున్నట్లు.... క్యూలో నిలబడి మరీ కొనుక్కుంటాయి. వ్యక్తుల చేతుల్లోకి కాకుండా ఓ దేశ ప్రభుత్వం చేతిలోకి ఆ మందు చేరితే - ఆ దేశం చక్రవర్తవుతుంది. మిగిలిన దేశాలు సామంత రాజ్యాలవుతాయి. చక్రవర్తి చెప్పింది వింటాయి -నడవమన్నట్లు నడుస్తాయి. వర్తకం - వాణిజ్యం - రక్షణ సహా అన్ని ద్వైపాక్షిక అంశాల్లో చక్రవర్తిదే పైచేయి. ఆ లీడ్ రోల్ కోసమే చాలా దేశాలు హర్రీబర్రీగా ప్రయత్నిస్తున్నాయి.
జర్మనీలోనూ ప్రయోగాలు ఫుల్ స్పీడులో ఉన్నాయి. అంతేకాదు - జర్మనీకి చెందిన క్యూర్ వ్యాక్ అనే సంస్థ వ్యాక్సిన్ కనుగొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పెద్దన్న అమెరికా రంగంలోకి దిగిందట. నయాన్నో - భయాన్నో ఆ వ్యాక్సిన్ దక్కించుకునేందుకు అగ్రారాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు జర్మనీ మీడియా వెల్లడించింది. క్యూర్ వ్యాక్ కు భారీగా నజరానా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు - ఆ వ్యాక్సిన్ హక్కులను కేవలం అమెరికాకే పరిమితం చేసుకోవాలని భావించినట్లు ఆ కథనంలో వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తో.... క్యూర్ వ్యాక్ చీఫ్ ఎగ్జిగ్యూటివ్ గత నెలలో సమావేశం కావడం కూడా ఆ వార్తకు బలం చేకూర్చింది.
జర్మనీ మీడియా కథనం - ఆ దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఏకంగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. జర్మనీ అమ్మకానికి లేదంటూ ఆర్థిక మంత్రి పీటర్ ఆల్ట్ మైర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. క్యూర్ వ్యాక్ చేపట్టిన పరిశోధనకు కావాల్సిన డబ్బును ప్రభుత్వమే ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ చెప్పారు. క్యూర్ వ్యాక్ తయారు చేసే వ్యాక్సిన్ ను ట్రంప్ సొంతం చేసుకోలేరని సవాల్ కూడా విసిరారు. అది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకూడదని - ప్రపంచదేశాలన్నింటికీ చేరాలన్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ సర్కారు అప్రమత్తమైంది. క్యూర్ వ్యాక్ లేబరేటరీ దగ్గర భారీగా భద్రత పెంచింది. లోపల్నుంచి చిన్న కాగితం ముక్క కూడా బయటకు పోకుండా కట్టుదిట్టం చేసింది. క్యూర్ వ్యాక్ లేబరేటరీ సిబ్బంది ఎవరూ బయటివాళ్లతో మాట్లాడకుండా ఆంక్షలు విధించడంతోపాటు - అక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వేగుల్ని సైతం నియమించింది. తన దగ్గర లేనిదాన్ని పక్కవారి నుంచి లాక్కునే లక్షణమున్న అమెరికా - జర్మనీ యాక్షన్ పై ఎలా రియాక్టవుతుందో..?