ప్రపంచమంతా కరోనా వ్యాపిస్తోంది. జర్మనీ తమ దేశ పౌరుల కోసం ఏకంగా 1984 కోట్లు పెట్టి మాస్కులు తయారు చేసింది. ఇక జర్మనీలో దిగుమతి చేస్తామనగా ఎవరో కొట్టేశారు. దీంతో ఆ దేశం ఇప్పుడు లబోదిబోమంటోంది.
ఇటలీకి సమీపంలోనే ఉండే జర్మనీ దేశంలోనూ కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో 32వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 150మంది మరణించారు. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏకంగా 241 మిలియన్ యూరోలు (1984 కోట్లు) వెచ్చిన మాస్కులు - శానిటరీ పరికరాల కోసం ఆఫ్రికా దేశాలకు ఆర్డర్ ఇచ్చింది.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి జర్మనీ దేశంలో ఫేస్ మాస్క్ ల కొరత వాటిల్లింది. దీంతో భారీగా వెచ్చించి ఆర్డర్ ఇచ్చింది. జర్మనీ విమానం తీసుకురావడానికి వెళ్లగా.. కెన్యా విమానాశ్రయంలో జర్మనీకి చెందిన 6 మిలియన్ల ఫేస్ మాస్క్ లు గల్లంతయ్యాయి. ఈ మేరకు జర్మనీ కస్టమ్స్ అధికారులు తమ మాస్కులు కెన్యా దేశంలో ఎవరో దొంగలించారని వాపోయారు.
జర్మనీ ఆర్డర్ ఇచ్చిన ఈ మాస్కులు 90శాతం కణాలను ఫిల్లర్ చేసే నాణ్యమైనవి. ఈ మాస్క్ లు వస్తే జర్మనీ వాసులకు కరోనా నుంచి ఊరట కలుగుతుంది. అయితే కెన్యా దేశంలో మాత్రం ఈ మాస్క్ లు గల్లంతుకావడంతో జర్మనీ తలపట్టుకుంది.
జర్మనీ మాస్కుల గల్లంతుపై దర్యాప్తు సాగుతోందని కెన్యా విమానాశ్రయ అథారిటీ ప్రతినిధి తెలిపారు. మార్చి 20న జర్మనీకి ఈ మాస్కులు రవాణా కావాల్సి ఉందని.. కెన్యాలో ఈ ముసుగులు ఎవరో దొంగలించారో కనిపెడుతామని కెన్యా అధికారులు తెలిపారు. ఈ మాస్కుల దొంగతనాన్ని తీవ్రంగా పరిణగిస్తున్నామన్నారు.