కాలగర్భంలోకి ఒక ఏడాది ముగిసి.. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నామంటే ఆ జోషే వేరుగా ఉంటుంది. కానీ.. ఈసారి అందుకు కాస్త భిన్నం. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వస్తున్న దానిపై పెద్ద జోష్ కనిపించట్లేదు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో 2020 ఎన్నో షాకుల్ని.. అంతకు మించిన విషాదాల్ని నింపింది. అలా అని వస్తున్న 2021లో పరిస్థితి బాగుంటుందా? అంటే.. అది సందేహమే. కాస్తంత ఆశ.. అంతలోనే నిరాశ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.
కొత్త సంవత్సరం వస్తుందంటే పెళ్లి కాని ప్రసాద్ లకు అదోలాంటి ఉత్సాహం. న్యూఇయర్ లో అయినా తమ జీవితాలు సరికొత్తగా ఉంటాయన్న ఆశ ఉంటుంది. కానీ.. 2021 ఎంట్రీలోనే భారీ షాకిచ్చిందంటున్నారు. ఎందుకంటే.. కొత్త సంవత్సరం మొదటి ఐదు నెలల వరకు సరైన పెళ్లి ముహుర్తాలు లేవట. మరి ముఖ్యంగా పెళ్లి ఏమైనా చేసుకుంటే జనవరి మొదటి వారం తప్పించి.. ఆ తర్వాత తగిన ముహుర్తాలు లేవంటున్నారు.
జనవరి మొదటి వారంలో పెళ్లి డేట్ కన్ఫర్మ్ కాకుంటే మళ్లీ మే 16 వరకు ఆగాల్సిందేనట. దీంతో.. పెళ్లిళ్ల విషయంలో కొత్త సంవత్సరం ఎంట్రీలోనే చేదు కబురును తీసుకొస్తున్నట్లుగా చెప్పక తప్పదు. ఇక.. పెళ్లిళ్ల మీద చాలానే వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. ముహుర్తాలు బాగుంటే వారి వ్యాపారాలు మహా జోరుగా ఉంటాయి. ముహుర్తాలు లేని కారణంగా వారి వ్యాపారాల మీద ప్రభావం పడుతుందని చెప్పక తప్పదు. కరోనా.. లాక్ డౌన్ లాంటి కారణాలతో 2020 దాదాపుగా దెబ్బేస్తే.. ఇప్పుడు వస్తున్న 2021 మొదటి ఆర్నెల్లు అలాంటి పరిస్థితే ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.