డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ ను వదిలేలా కనిపించడం లేదు. అప్పట్లో బయటపడ్డ ఈ ఉదంతంలో టాలీవుడ్ ప్రమేయంపై దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. టాలీవుడ్ దర్శకులు, స్టార్ హీరోలు, వర్ధమాన నటీనటులు ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కేసు విషయంలో మొదట సీరియస్ గా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అనంతరం టాలీవుడ్ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడులకు తలొగ్గి నీరుగార్చిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆ డ్రగ్స్ కేసు ఏమైందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
తాజాగా మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ మూలాలు బయటపడం సంచలనం సృష్టిస్తోంది. సంపన్నుల పిల్లలు, బడా స్కూళ్లలో చదివే విద్యార్థులను టార్గెట్ చేసిన ఓ ముఠా ఓ యువతి ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తుండగా హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఆమె నుంచి పెద్ద ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈమెను విచారించిన పోలీసులకు ఘానా దేశానికి చెందిన యువతిగా తేల్చారు. యువతి కొద్దిరోజులుగా హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతున్నట్టు తేలింది. నగరంలోని పలు ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల పిల్లలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించినట్టు పోలీసుల విచారణలో యువతి తెలిపింది.
యువతి చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆమె దగ్గర ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు.? ఆ బడా బాబుల పిల్లలు ఎవరని ఆరాతీస్తున్నారు. వారందరికీ నోటీసులు ఇస్తామని తాజాగా అధికారులు చెప్పారు. ఇక సిటీకి డ్రగ్స్ తీసుకొచ్చే ముఠా ఎవరు? ఎవరెవరున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు.
దీంతో మరోసారి డ్రగ్స్ వాడకందారుల బండారం బయటపడనుంది. ఇందులో బడా బాబుల పిల్లలే ఉన్నారని తేలడంతో హైదరాబాద్ లో కలకలం చెలరేగుతోంది. వారు ఎవరనేది పోలీసులు తేలుస్తారా.? లేదా ఒత్తిడులతో యథాలాపంగా మూసేస్తారా అన్నది వేచిచూడాలి.