దారి తప్పిన తమ్ముళ్ళు అని గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పెద్ద మనసుతో చంద్రబాబు ఆదరించి అక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు ఎపుడూ రాజకీయంగా ఆలోచిస్తారు. అదే టైం లో ఆయన ఎవరినీ శత్రుభావంతో చూడరు. రాజకీయాలు అన్నాక ఇలాంటివి ఉంటాయని సర్దుకునిపోయే మనిషి. అందుకే ఆయన్న రాజకీయంగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్నారు.
ఇకపోతే చంద్రబాబు ఘర్ వాపసీ అంటూ తెలంగాణాలో ఇతర పార్టీలలో చేరిన తమ్ముళ్లకు పిలుపు ఇస్తున్నారు. వారంతా టీయారెస్ కాంగ్రెస్ సహా ఇతర పార్టీలలో చేరిపోయారు. ఈ మధ్యనే తెలంగాణాలో పార్టీని రీ యాక్టివేట్ చేస్తున్న చంద్రబాబు తమ్ముళ్లకు పిలుపు ఇచ్చారు. ఇక దాని ఫలితం ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది.
అయితే ఏపీలో మాత్రం బాబు అలాంటి పిలుపు ఇవ్వడంలేదు. 2019 ఎన్నికల ముందు చూస్తే చాలా మంది తెలుగు తమ్ముళ్ళు టీడీపీని వీడిపోయారు. అందులో చాలా మంది వైసీపీలో చేరారు. అలాగే మరికొంతమంది బీజేపీలో చేరారు. ఇక వైసీపీలో అయితే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అనధికారికంగా చేరిపోయరు. ఎంపీలు నలుగురు బీజేపీ చేరిపోయారు.
మరి ఏపీలో బాబు ఘర్ వాపసీ అన్న నినాదాన్ని అందుకోరా అన్నదే చర్చగా ఉంది. నిజానికి బాబు కనుక అలాంటి పిలుపు ఇస్తే మాత్రం పరుగు పరుగున వచ్చేందుకు చాలా మంది తమ్ముళ్ళు వెయిట్ చేస్తున్నారుట. అలాగే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా బాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు అని అంటున్నారు.
అలాంటి వారు కనుక తిరిగి టీడీపీలోకి వస్తే పార్టీ అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా తెలుగుదేశానికి కూడా వెన్నుదన్నుగా వారు ఉంటారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఆదినారాయణరెడ్డి ఉన్నారు. ఆయన మాజీ మంత్రి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బాబు పిలుపు ఇవ్వాలీ కానీ ఆయన వచ్చి వాలుతారు అని అంటున్నారు. కడప జిల్లాకు చెందిన ఈ నాయకుడు ఒక బలమైన నేతగా ఉన్నారు.
అలాగే సీఎం రమేష్, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన ఎంపీ. ఆయన గత ఎన్నికల్లో ఏకంగా కడప జిల్లా అంతా ఆర్ధికంగా భరోసా ఇచ్చి చూసుకున్నారు. మరి ఆయనను వెనక్కి రప్పించుకోవచ్చు కదా. అలాగే సుజనా చౌదరి కానీ కర్నూల్ కి చెందిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కానీ బాబు పిలుపు ఇస్తే రెడీ అనే అంటారని చెబుతున్నారు.
ఇక వైసీపీకి జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ బాబు కోసం సై అనడానికి రెడీ అంటున్నారు మరి బాబు ఎందుకు ఏపీలో ఘర్ వాపసీ ప్రోగ్రాం పెట్టడం లేదు అని అన్న డౌట్లు అయితే అందరిలో పుడుతున్నాయి. అయితే ఎక్కువ మంది నాయకులు బీజేపీలో ఉన్నారు. వారిని వెనక్కి రప్పిస్తే బీజేపీకి కోపం రావచ్చు అన్న ఆలోచనతోనే బాబు ఘర వాపసీకి పిలుపు ఇవ్వడంలేదు అని అంటున్నారు. పైగా బాబు తానే సర్దుబాటు చేసి వారిని వెనక్కి పంపించారు అన్న టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా ఏపీలో మాత్రం బాబు తలుపులు తెరవడం లేదు. తెరిస్తే మాజీ తమ్ముళ్ళలో చాలా మంది రిటర్న్ వచ్చేయడానికి సిద్ధం అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.