వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తూ వేగంగా స్పందిస్తున్నారు. సమీకరణాలను లెక్కలేసుకుంటూ అడుగులు వేస్తున్న జగన్ తాజాగా తనకు భరోసా దక్కాల్సిన కీలక సామాజికవర్గంపై కన్నేశారు. పార్టీకి పెద్దగా అండగా నిలబడని కమ్మ ఓటుబ్యాంకుపై దృష్టిసారించి ప్రిన్స్ మహేశ్ బాబు కుటుంబ సభ్యుడికి కీలక స్థానం కట్టబెట్టారు.
మహేశ్ తండ్రి - సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావుకు వైసీపీ అత్యున్నత నిర్ణయాక విభాగమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ)లో సభ్యత్వం కల్పించారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆదిశేషగిరిరావుకు పీఏసీలో చోటు కల్పించడంతో ఆ జిల్లాలో పార్టీని విస్తరించేందుకు మార్గం సుగమం చేసే ఎత్తుగడలో భాగంగానే ఈ నియామకం జరిగినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
స్వతహాగా కాంగ్రెస్ వాది అయిన ఆదిశేషగిరిరావు దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు. ఏఐసీసీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గా, విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆదిశేషగిరిరావు పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు.