గ‌జ‌ల్ బ్యాడ్‌ టైం కొన‌సాగుతోంది

Update: 2018-01-05 14:32 GMT
మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో అరెస్ట‌యిన‌ గజల్ శ్రీనివాస్ బ్యాడ్ టైం కొన‌సాగుతోంది. లైంగిక వేధింపులపై విచారణ ఎదుర్కొంటున్న గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌ పై నాంపల్లి కోర్టులో నేడు వాదనలు జరిగాయి. గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.వేధింపుల కేసులో దర్యాప్తు పురోగతి కోసం గజల్ శ్రీనివాస్‌ ను పోలీసులు 4 రోజుల కస్టడీ కోరారు. పోలీసుల విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించిన‌ట్లే...గ‌జల్ పిటిష‌న్ కూడా తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది.

రేడియో జాకీని వేధించిన కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్‌ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించిన విషయం తెలిసిందే. బాధితురాలు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని ఆధారాల సేకరణ నిమిత్తం గజల్ శ్రీనివాస్‌ ను పోలీసులు కస్టడీ కోరారు. అయితే ఆయ‌న పిటిష‌న్ తిరిస్క‌రించారు. ఆ మ‌రుస‌టి రోజే గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా కేసులో ఏ2 నిందితురాలు పరారీలోనే ఉందని కావునా గజల్ శ్రీనివాస్‌ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం గజల్ బెయిల్ పిటిషన్‌ ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.

కాగా, గజల్‌ కేసుకు సంబంధించి తీర్పు చెప్పనున్న  స‌మ‌యంలో కోర్టు పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలు ఇచ్చిన సీడీలను ఎఫ్‌ ఎస్‌ ఎల్‌ కు పంపిస్తున్నామని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు తెలుపగా...కోర్టు అనుమతి లేకుండా ఎఫ్‌ ఎస్‌ ఎల్‌ కు ఎలా పంపారని కోర్టు ప్రశ్నించింది. సీడీలను తమకు ఎందుకు అందజేయలేదని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. అయితే, ఏ2 నిందితురాలు పార్వతి పరారీలో ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

అయితే అంత‌కుముందే ఆయ‌న‌కు షాక్ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. ఖైరతాబాద్ ఆనంద్‌ నగర్‌ లో నిర్వహిస్తున్న సేవ్ టెంపుల్ అనే సంస్థకు శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్నాడు. ఆ సంస్థకు చెందినదే ఆలయవాణి రేడియో. సంస్థ యజమానులు అమెరికాలో ఉంటుండగా... శ్రీనివాస్‌ కు ఆ సంస్థ బాధ్యతలను అప్పగించడంతో ఆయనే ఆ సంస్థ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అయితే... ఆయన లైంగిక వేధింపుల కేసులో అరెస్టవడంతో సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌ గా ఆయనను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News