'గ్రేటర్' ఎన్నికలకు తెర లేవనుదంని ఇప్పటికే హైదరాబాద్ ప్రజలకు అర్థమైంది... నగరమంతా నిలువెత్తు ఫ్లెక్సీల్లో గులాబీ రంగు కనిపిస్తుంటే ఎన్నికలు కాకుండా ఇంకేం కారణం ఉంటుంది అని ఇప్పటికే అనుకుంటున్నారు. ప్రతిపక్షాలన్నీ ఊహిస్తున్నట్లుగానే సంక్రాంతి పండుగ సమయంలోనే గ్రేటర్ ఎన్నికలకు ముహూర్తం పెట్టినట్లుగా సమాచారం. జనవరి 17న జీహెచ్ ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని... అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓకే చెప్పిందని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఎన్నికల సంఘం ప్రకటన చేయబోతోంది.
జనవరి మూడవ వారంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు తెలిపింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరుగుతున్న సర్వే ప్రక్రియ మరో పది రోజుల్లో ముగియనున్నదని సమాచారం. ఎన్నికల నిర్వహణకు సంబం ధించి ఇప్పటికే డివిజన్లవారీగా అధికారులు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. పోలింగ్ కు సంబంధించి అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) లను ఎన్నికల సంఘం సమకూర్చుకునే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈవీఎంల కొనుగోలుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.
జనవరి తొలి వారంలో ఈవీఎంలను సిద్ధం చేసి అందు బాటులో ఉంచుతామని ఈసీఐఎల్ ఉన్నతాధికారులు ఎన్నికల సంఘానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి ఆ తర్వాత ఎన్నికలు జరిగితే ప్రయోజనం ఉండదని ఇప్పటికే నగర ప్రజలు దాహర్తితో అల్లాడుతున్నారని అప్పటిదాకా వేచి ఉండకుండా జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జవనరి 17న పోలింగ్ జరిపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.