ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టీఆర్‌ఎస్ పార్టీ విధేయులకే వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అందరూ ఊహించిన విధంగానే ముగిసింది. టీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభపక్ష నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్ ఎంసీ మేయర్ గా ఎన్నియ్యారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా.. శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు.
ఇదిలా ఉంటే .. గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జీహెచ్ ఎంసీ షాకిచ్చింది. ఈ నెల 11న గ్రేటర్ మేయర్ గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా శ్రీలత ఎన్నికయ్యారు. మేయర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె అనుచరుడు అతిష్ అగర్వాల్.. నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నగర పౌరుడు ట్విట్టర్ లో జీహెచ్ ఎంసీ అధికారులను ప్రశ్నించాడు.
దీంతో అప్రమత్తమైన జీహెచ్ ఎంసీ అధికారులు.. ఫ్లెక్సీలు అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సదరు విజయలక్ష్మి అనుచరుడు అతిష్ అగర్వాల్ పై అధికారులు కొరడా ఝళిపించింది. అతిష్ అగర్వాల్‌కు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ జీహెచ్ ఎం సీ ఈవీడీఎం అధికారులు షాకిచ్చారు.
జూబ్లీహిల్స్ లో టీఆర్ ఎస్ భవన్ సర్కిల్ వద్ద ఈ ఫ్లెక్సీని అతీష్ అగర్వాల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై ప్రతిపక్ష బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. టీఆర్‌ఎస్ క్యాడర్ సిటీలోని పలుచోట్ల నిబంధనలను ఉల్లంఘించి మేయర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నా ఆమె నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
బంజారాహిల్స్‌లో ఆమె నివాసమంటున్న ప్రాంతంలో కూడా ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినా ఆమె పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. జీవో నంబర్ 68 పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం హోర్డింగ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం గ్రౌండ్ లెవల్ నుంచి 15 అడుగుల వరకూ మాత్రమే ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ కు అనుమతి ఉంది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది.