తెలుగోళ్ల ముద్దుబిడ్డ ఎన్టీవోడు ఉన్న ఇల్లు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కమ్ ఏపీ మంత్రి లోకేశ్ కు ఎంతో ఇష్టమైన ఇల్లు.. ప్రస్తుతం ప్రముఖ సినీనటుడు.. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంలో కొంత భాగాన్ని జీహెచ్ ఎంసీ అధికారాలు కూల్చివేయనున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. రోడ్ల విస్తరణ.. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసాన్ని కొంతమేర కూల్చివేసేందుకు వీలుగా తాజాగా అధికారులు బాలకృష్ణతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ జూబ్లీహిల్స్ లోని 1355 ఇంట్లో ఉంటున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి కేబీఆర్ పార్క్ మీదుగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబరు 45ను కలిపేలా ఫ్లైఓవర్ ను నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తు ప్రముఖుల నివాసాల్ని కూల్చివేయనున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణ ఇంటిని కూడా కొంతమేర కూల్చక తప్పదన్న మాటను చెబుతున్నారు. అయితే.. ఇంటిని కూల్చివేసినందుకు నష్టపరిహారాన్ని అధికారులు అందిస్తారని చెబుతున్నారు. అభివృద్ధి పనులకు సహకారం అందిస్తూ.. ఇంటి కూల్చివేతకు బాలకృష్ణ అంగీకరిస్తారన్న ఆశాభావాన్నివ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వందలాది చెట్లను నరుకుతున్నట్లుగా కొందరు గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. అయితే.. తాము నిబంధనల్ని పాటిస్తున్నామని.. చెట్లను నరికేసినట్లుగా వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అధికారులు ట్రిబ్యునల్ కు పేర్కొన్నారు. దీనిపై తీర్పు వెలువడాల్సి ఉంది. తీర్పు వెలువడిన వెంటనే.. పనులు ప్రారంభించనున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ కట్టించుకొని.. ఆపై బాలకృష్ణకు ఇచ్చిన ఇంట్లోని కొంత భాగాన్ని కూల్చివేయక తప్పని పరిస్థితిగా చెబుతున్నారు. ఈ ఉదంతంపై బాలకృష్ణ రియాక్షన్ ఏమిటన్నది బయటకు రాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/