ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు కానుంది. మొదల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి.. ఆ తర్వాత మిగిలిన ఓట్ల లెక్కింపు మొదలెడతారు. కౌంటింగ్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేశారు.
పురానాపూల్ లో రీపోలింగ్ నేపథ్యంలో ఉదయం జరగాల్సిన ఓట్ల లెక్కింపును మధ్యాహ్నం నుంచి షురూ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయినా.. పురానాపూల్ రీపోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎన్నికల ఫలితాల్ని జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఫలితం సాయంత్రం 5 గంటలకు మొదలు కానుంది.
గ్రేటర్ ఫలితాల్లో తొలుత దత్తాత్రేయ నగర్.. అక్బర్ బాగ్.. రెయిన్ బజార్.. నవాబ్ సాహెబ్ కుంట డివిజన్ల ఫలితాలు తొలుత వచ్చే అవకాశం ఉంది. చివరగా మాత్రం సరూర్ నగర్.. ఆర్కే పురం.. చంపాపేట.. గడ్డి అన్నారం.. యూసఫ్ గూడ.. సనత్ నగర్.. మోండా మార్కెట్.. కొత్తపేట డివిజన్ల ఫలితాలు రానున్నాయి. అన్నింటికంటే ఆఖరున పురానాపూల్ ఫలితం వెలువడే అవకాశం ఉంది.