దేశంలో ఒక ప్రతిష్టాత్మక ఎన్నికకు రంగం సిద్ధం అయింది. దేశానికి కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం అంతా రెడీ అయింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో పూర్తి అవుతోంది. దాంతో షెడ్యూల్ ప్రకటించేసారు.
కోవింద్ వారసుడు ఎవరు అన్నదే ఇపుడు అంతటా చర్చగా ఉంది. ప్రస్తుత ఉప రాష్త్రపతి ఎం వెంకయ్యనాయుడుకు ప్రమోషన్ ఉంటుందా అన్నదే అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్న అంశం. అయిదేళ్ల క్రితం ఆయన వద్దు అంటూనే ఉప రాష్ట్రపతి అయ్యారు. ఇపుడు దేశంలో అత్యున్నతమైన పదవి ఆయనను వరిస్తుందా అన్నదే అందరిలో ఉత్కంఠను రేపుతున్న విషయం.
నిజానికి ఉప రాష్ట్రపతులను రాష్ట్రపతులుగా చేసిన సంప్రదాయం ఉంది. సర్వేపల్లి రాధాక్రిష్ణన్ తో ఇది మొదలైంది. అలా 1997 దాకా కొనసాగింది. కే ఆర్ నారాయణ్ నాడు ఉప రాష్ట్రపతి నుంచి ప్రమోట్ అయ్యారు. ఆ తరువాత మాత్రం సీన్ మారింది. అయితే వెంకయ్యనాయుడు విషయంలో ఆ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుందని అవాలని కోరుకుంటున్నారు.
ఆయన తెలుగువారు. సౌతిండియా సింబల్ గా ఉంటారు. బీజేపీలో కీలక పదవులు నిర్వహించిన వారు, ఇపుడు బీజేపీకి రాష్ట్రపతిగా తమ వారిని గెలిపించుకునే స్తోమత ఉంది. దాంతో ఈసారి సౌత్ అంటూ కనుక లెక్క వేసుకుంటే ఆయనకు అవకాశం ఉంటుంది. అయితే 2024లో ఎన్నికలు ఉన్నాయి. దాంతో చాలా సామాజిక రాజకీయ అంశాలు పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఆయనకు అవకాశాలు తగ్గవచ్చు అంటున్నారు.
ఇక కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ కి రాష్ట్రపతి పదవి ఇవ్వాలని, మైనారిటీని ప్రధమ పౌరుడిని చేసి బీజేపీ తన మీద ఉన్న మతపరమైన మచ్చను పోగొట్టుకోవాలని చూస్తుంది అని అంటున్నారు ఇక కాశ్మీర్ ఇష్యూ ఉండనే ఉంది. దాంతో అక్కడికి చెందిన గులాం నబీకి ఇస్తే కనుక ఇంకా క్రెడిట్ దక్కుతుంది అని ఆలోచించవచ్చు అంటున్నారు. అయితే ఈ పేరుకు ఆరెస్సెస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది అంటున్నారు.
ఇక ఈ ఇద్దరూ కాకుండా అగ్ర కులాల నుంచి కూడా పేర్లు వస్తున్నాయి. బ్రాహ్మిణ్ సామాజిక వర్గానికి ఈసారి ప్రయారిటీ ఇస్తారని అంటున్నారు. అలాగే మహిళకు కూడా చాన్స్ రావచ్చు అంటున్నారు. మొత్తానికి చూస్తే అనూహ్యమైన పేరే తెర మీదకు రావచ్చు అని తెలుస్తోంది.