రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నిన్నటి శత్రువు నేడు మిత్రుడు కావొచ్చు. నేటి మిత్రుడు రేపటికి శత్రువు కూడా కావొచ్చు. సో.. ఇప్పుడు ఇలాంటి పరిణామమే జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని.. రాత్రికి రాత్రి.. ఉరుములు లేని పిడుగులా .. పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి జమ్ము కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్.. అప్పట్లో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ఇక, బతకదని.. కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆయన ప్రత్యేకంగా ఒక పార్టీ కూడా పెట్టుకున్నారు. అయితే.. ఇది జరిగిన పట్టుమని మూడు మాసాలు కూడా కాకుండానే.. అదే కాంగ్రెస్‌పై ఆజాద్ ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.
ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ.. ''నేను కాంగ్రెస్ నుండి విడిపోయినప్పటికీ, వారి లౌకికవాద విధానానికి నేను వ్యతిరేకం కాదు. పార్టీ వ్యవస్థ బలహీనపడటం వల్లనే నేను పార్టీని వీడాల్సి వచ్చింది'' అని ఆజాద్ వ్యాఖ్యానించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని, ఆప్ ఆ పనిచేయలేదని ఆజాద్ చెప్పడం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లిం, రైతులందరినీ, అన్నివర్గాల ప్రజలను ఆదరిస్తుందని ఆజాద్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ అంటూ విమర్శలు చేశారు. పంజాబ్‌లో ఆ పార్టీని గెలిపించినప్పటికీ ప్రజల ఆశల మేరకు సమర్థపాలన అందించడం లేదని ఆరోపించారు. త్వరలో జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాత్రమే బీజేపీని సవాల్ చేయగలదన్నారు.
ఇదిలాఉంటే.. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించడంపై, తాను ఈ సమస్యను చాలాసార్లు లేవనెత్తానని, కేంద్ర ప్రభుత్వం చేస్తే అది స్వాగతించదగిన చర్య అని ఆజాద్ అన్నారు. మొత్తానికి ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.