తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ - ఎన్నికలకు అంతా సిద్దంగా ఉండాలని తమ మంత్రులకు సూచించారు. ఈ ప్రకటనతో మిగతా రాజకీయ పార్టీలలో వేడి పుట్టింది. తెలంగాణ ఇస్తే మీతో కలసి పనిచేస్తామంటూ, ఆ తర్వాత హత్ ఇచ్చిన కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ తన పార్టీ సీనియర్ నేత వ్యూహాలు అమలుపరచడంలో దిట్ట అయిన గులాం నబీ ఆజాద్ ను రంగంలో దింపనుంది. కేసీఆర్ ఎలాగైన ఓడించి తమ జండాను తెలంగాణలో పాతలని గట్టి పట్టుదలతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ఖుంటీయా - ఇక్కడి పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన గలాం నబీ ఆజాద్ వ్యూహ ప్రతి వ్యూహాలలో దిట్ట. ఈ నెలాఖరకు ఆయన హైదారబాద్ వచ్చే అవకాశం ఉందని గాంథీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఆయన ముందుగా రాష్ట్రంలోని పార్టీ నాయకులతో తెలంగాణలోని పరిస్థితులను గురించి చర్చించస్తారని, ఆ తర్వాత వారికి తదుపరి కార్యచరణపై దిశానిర్దేశం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
గతంలో తెలుగు రాష్ట్రలలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను ఇప్పుడు దిద్దుకునే ప్రయత్నం చేస్తోంది.తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో 2014 లో ఘోరంగా మోసపోయన తామూ కేసీఆర్ ఓటమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోంది. అందుకోసం తన సర్వశక్తులు ధారపోస్తోంది. తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తుకు సిద్దపడి మళ్లీ కోటాలోకి పాగా వేద్దమని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అంతే కాకుండా ఇతర పార్టీలను కూడగట్టే పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో తెలంగాణ జన సమితీ నాయకుడు అయిన ప్రోఫేసర్ కోదండరామ్ తో కూడా మంతనాలు జరిపినట్లు సమాచారం. తెలంగాణలోని అభ్యర్దుల ఎంపికలో కూడా కాంగ్రెస్ ఆచీ తూచీ వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమైన నాయకులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. బూత్ పాయింట్ నుంచి అభ్యర్దుల ఎంపిక చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం కమీటీలు కూడా ఏర్పాటు చేసారు .ఇందుకోసం పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి ప్రతిరోజు రెండు జిల్లాల నాయకులతో వీడియో కాన్ఫరేన్స్ ద్వారా జిల్లాలోని కార్యకర్తలతోను - గ్రామ స్దాయి నాయకులతోను సంభాషిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో గెలుపు మాదే అని, 100 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని తెలంగాణ ముఖ్మమంత్రి కె.చంద్రశేఖర రావు ధీమాగా ఉన్నారు. టీఆర్ ఎస్ ను ఎలాగైన ఓడించి కోటలో పాగా వేయాలని తమ సర్వశక్తులు ఓడుతోంది కాంగ్రెస్ పార్టీ. వీరిద్దిరిలో గెలుపు ఎవరిదో వేచి చూడాల్సిందే.