తమిళనాడు సముద్ర తీరంలో ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. ఒడ్డుకు భారీ తిమింగలం కనిపించడంతో మద్యత్సకారులు ఆందోళన చెందారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద తిమింగలాన్ని చూడని స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఈ విషయాన్ని వెంటనే బీచ్ అధికారులకు తెలిపారు. అయితే ఆ తిమింగలం చనిపోయి ఉంది. ఇది తమిళనాడులోని రామనాథపురం జిల్లా అలంగన్ కులం బీచ్ సమీపం లో జరిగింది.
పద్దెనిమిది అడుగుల పొడవుతో ఉన్న తిమింగలం సముద్రం నుంచి కొట్టుకుని ఒడ్డుకు చేరుకుంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బీచ్ ప్రాంతంలోని అధికారులకు తెలిపారు. బీచ్‌కు చేరుకుని బీచ్, అటవీ శాఖ అధికారులు తిమింగలాన్ని పరిశీలించారు. అయితే తిమింగలానికి గాయాలు ఉన్నాయి. దవడ దగ్గర గాయమై ఉండడమే కాకుండా, మరోవైపు మైనపు ఉత్పత్తులు, ఆయిల్ వంటి పదార్ధాలు ఉన్నట్లు గుర్తించారు. శవ పరీక్ష చేసిన అనంతరం దానిని ఖననం చేశారు. మన్నార్ శాఖ ప్రాంతంలో నాలుగేళ్లుగా నాలుగు తిమింగలాలు మాత్రమే ఉన్నాయని.. అయితే ఈ తిమింగలం మాత్రం ఇక్కడి ప్రాంతానికి సంబంధించింది కాదని బీచ్ అధికారులు చెబుతున్నారు. ఈ తిమింగలాన్ని డ్రగ్స్ రవాణా కోసం ఎవరైనా చంపి ఉండివచ్చని.. లేదంటే రాళ్లకు తగిలి గాయపడి మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.