విమర్శలు చేయటం తప్పేం కాదు. కానీ.. దానికి ఒక పద్ధతి పాడు అన్నది ఉండాలి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ నేతృత్వంలో విశాఖ జిలాలోని చింతపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే గిడ్డీ ఈశ్వరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నరరూప రాక్షసుడు.. వెన్నుపోటుదారుడు.. దగాకోరు అంటూ వ్యక్తిగత విమర్శలతో హోరెత్తించారు. బాక్సైట్ జోలికి వస్తే గిరిజన సంప్రదాయం ప్రకారం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తల తెగ నరుకుతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈశ్వరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ అలజడిని సృష్టిస్తున్నాయి. విమర్శలు చేయటం తప్పేం కాదు కానీ.. మరీ ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయటం అవసరమా? అన్న మాట వినిపిస్తోంది.
బాక్సైట్ తవ్వకాలకు ఉద్యమిస్తున్న ఏపీ విపక్షం.. విశాఖ ఏజెన్సీలో తమ పట్టు పెంచుకోవటానికి విపరీతంగా శ్రమిస్తోంది. ఇదే బాక్సైట్ తవ్వకాలు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో చేపట్టటం గమనార్హం. బాబు మీద ఈ స్థాయిలో విరుచుకుపడినఈశ్వరి.. పాడేరులో అభ్యర్థిని నిలబెడతానంటే.. తన పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయటానికి తాను సిద్ధమేనంటూ సవాలు విసిరారు. ఒకవేళ తాను గెలవకపోతే.. రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని.. ఒకవేళ.. అధికారపక్షం కానీ విజయం సాధించని పక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. మరి.. ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఈశ్వరి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మరే రేంజ్ లో చెలరేగిపోతారో..