గవాస్కర్​ రికార్డును చెరిపేసిన గిల్​..!

Update: 2021-01-19 17:30 GMT
ఆస్ట్రేలియా గడ్డమీద టెస్ట్​ సీ రిస్​ను గెలుపొందిన భారతజట్టు సరికొత్త రికార్డులు నమోదు చేసింది. అయితే ఈ టెస్ట్ సీరిస్​లో అనేక కొత్త రికార్డులు కూడా నమోదయ్యాయి. ఈ సీరిస్​తో తొలిసారిగా టెస్ట్​ మ్యాచ్​ల్లోకి అరంగేట్రం చేసిన శుభమన్ గిల్​ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్​ సీరిస్​ నాలుగో ఇన్సింగ్స్ లో అతి చిన్న వయసులో హఫ్​ సెంచరీ చేసిన బ్యాట్స్​మెన్​గా చరిత్ర కెక్కాడు. గతంలో ఈ రికార్డు లెజెండరీ బ్యాట్స్​మన్​ సునీల్​ గవాస్కర్​ మీద ఉంది. ప్రస్తుతం గిల్ ఆ రికార్డును చెరిపేశాడు.

 బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 9 ప‌రుగుల తేడాలో సెంచరీ మిస్ అయినా.. 50 ఏళ్ల కింద‌టి ఓ రికార్డును గిల్ తిర‌గ‌రాశాడు. ఓ టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీ చేసిన అత్యంత పిన్న వయసు గల భారత ఓపెన‌ర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు.  సన్నీ 1970-71లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో 67 ప‌రుగులు చేశాడు.  ఈ టెస్ట్​ సిరీస్​ను భారత జట్టు గెలుపొందడం పట్ల దేశవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి.

 ప్రధాని నరేంద్రమోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారత క్రికెట్​ జట్టును అభినందిస్తున్నారు.మరోవైపు సోషల్​మీడియాలో సైతం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్​ క్రికెటర్లు వివిధ కారణాలతో ఈ టెస్ట్​ సీరిస్​లో పాల్గొనలేకపోయినా.. కుర్రాళ్లు అదరగొట్టారంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.
Tags:    

Similar News