ఆ రాష్ట్ర మంత్రిని కొరికిన ఎలుక.. దానికే ఆరోగ్యం క్షీణించి హైరానా

Update: 2022-05-03 04:28 GMT
ఆయనో రాష్ట్ర మంత్రి. అలాంటి ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సర్కారు వారి గెస్టు హౌస్ లో బస చేశారు. నిద్రలో ఉన్న ఆయనకు ఏదో కొరికినట్లుగా ఫీల్ అయి.. నొప్పి రావటం.. వెంటనే కళ్లు తెరిచి చూస్తే.. కాలు కొరికిన వైనంతో నెలకొన్న హడావుడి అంతా ఇంతా కాదు. కొరికింది ఎలుక అయితే.. పాము కరిచిందన్న భావనతో సదరు మంత్రి షాక్ కు గురి కావటమే కాదు.. ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణిచింది.

ఈ విచిత్ర ఉదంతం చోటు చేసుకున్నది ఎక్కడంటే.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో. అసలేం జరిగిందంటే..డబుల్ ఇంజిన్ సర్కారుగా గొప్పలు చెప్పుకునే యూపీలో రాష్ట్ర మంత్రి గిరీశ్ చంద్ర యాదవ్ కు వింత అనుభవం ఎదురైంది.

తాజాగా ఆయన యూపీలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ క్రమంలో ఆయన ఒక విశ్రాంతి భవనంలో సేద తీరుతున్నారు. నిద్ర పోతున్న ఆయన కాలును ఎలుక కొరికింది. నొప్పితో నిద్ర లేచిన ఆయన.. తనను కొరికింది పాముగా ఫీల్ అయ్యారు. ఆ టెన్షన్ తో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.

దీంతో ఆయన్ను కరిచింది ఎలుకనా? పామునా? అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు మంత్రి ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తున్న వేళ.. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంత్రిగారికి అయిన గాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు.. ఆయన్ను కరించింది పాము కాదని.. ఎలుకగా తేల్చారు.

 ఇంతకీ పాము ప్రస్తావన ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆ ప్రాంతం అటవీ ప్రాంతం కావటంతో తనను కరిచింది ఎలుక అని తేలటంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. అప్పటివరకు టెన్షన్ తో క్షీణించిన ఆయన ఆరోగ్యం కుదుటబడటం గమనార్హం.

అంతా బాగుంది కానీ.. డబుల్ ఇంజిన్ సర్కార్ అని.. యూపీలో ఒక రేంజ్ కు తీసుకెళుతున్నట్లుగా సాగుతున్న ప్రచారానికి భిన్నంగా మంత్రి బస చేసే గెస్టు హౌస్ లో ఎలుకలు ఉండటం ఏమిటో? అవి కూడా మనుషుల్ని కరిచేంతలా ఉన్నాయన్నవిస్మయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News