తాను ప్రేమించినవాడు దక్కలేదనే ఆవేదనతో ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. తన మెడలో తాళి కడతాడనుకున్న బావ మొహం చాటేయడంతో ఆమె మనసు చిన్నబోయింది. ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రియుడికి చివరిసారిగా లేఖ రాసి తనువు చాలించింది. ప్రేమ విఫలం కావడంతో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నిడదవోలు మండలం తాళ్లపాలెంలో జరిగింది.
‘ప్రియమైన బావకు నువ్వంటే నాకు ప్రాణం.. నేనంటే నీకు చాలా ఇష్టం కదరా.. మరి నన్ను ఎలా మోసం చేశావు.. నన్ను ఎందుకు వదిలేశావు. నీతో పెళ్లి అనగానే ఎన్నో కలలు కన్నాను. నాలో చాలా కోరికలు.. ఆశలు పెట్టుకున్నాను. నువ్వే నా ప్రాణం రా.. నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. నీ జ్ఞాపకాలు మరిచిపోలేకపోతున్నాను. నేను చనిపోయినా మరిచిపోనురా’ అని ఆ యువతి తన ప్రియుడికి లేఖ రాసింది.
తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన పిల్లి కొండబాబు, బేబి దంపతులు తాళ్లపాలెంలో నివాసముంటున్నారు. వీరి పెద్ద కుమార్తె నాగరత్నం (21) ఏడో తరగతి వరకు చదివింది. హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో వీరి బంధువు కల్యాణ్‌ను ఇష్టపడింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నా రు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. నాగరత్నం కుటుంబసభ్యులు రూ.74 వేలను ఆరు నెలలు క్రితం కల్యాణ్ కుటుంబానికి అప్పుగా ఇచ్చారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని నాగరత్నం ఎంతో ఆశ పెట్టుకుంది.
ఏమయిందో ఏమోగానీ, వీరి వివాహానికి పెద్దలు పూర్తిగా అంగీకరించలేదు. అంతేక కాకుండా, కల్యాణ్ సుమారు 13 రోజులుగా నాగరత్నంకు ఫోన్ చేయడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె దూలానికి ఉరి వేసుకుని తనువు చాలించింది. మృతురాలి తల్లి బేబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/