యుద్ధానికి సై అంటూ గ్లోబల్ టైమ్స్ బలుపు మాటలు విన్నారా?

Update: 2020-09-02 10:50 GMT
ఇరుగుపొరుగు దేశాలతో నిత్యం ఏదో ఒక వివాదం పెట్టుకునే చైనా ఇప్పుడు యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్లుగా కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా భారత్ - చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్న వేళ.. చైనా అధికారపక్షానికి కరపత్రంగా చెప్పు గ్లోబల్ టైమ్స్ లో అక్షరాలతో రెచ్చిపోయారు. భారత్ ను చులకన చేసేలా వ్యాఖ్యలతోపాటు.. యుద్ధం వస్తే భారత మిలటరీని మూసివేయాల్సి ఉంటుందని పేర్కొంది.

అమెరికా అండ ఉన్నా.. భారత్ ను చైనా ధీటుగా ఎదుర్కొంటుందని.. ఓటమి తప్పదని స్పష్టం చేయటమే కాదు.. భారత్ కంటే శక్తిసామర్థ్యాల్లో చైనా ఎన్నో రెట్లు ముందు ఉంటుందన్న గ్లోబల్ టైమ్స్.. భారత్ తమకు సమఉజ్జీనే కాదని బలుపు వ్యాఖ్యలు చేసింది. తాజాగా గ్లోబల్ టైమ్స్  సంపాదకీయంలో భారత్ మీద ఉన్న తన అసూయను వెళ్లగక్కింది. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అందులో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే..

-  అమెరికా వెంట ఉంటుందనే భ్రమల్లో భారత్ ఉంది. అమెరికా  ఎందుకు సహకరిస్తుంది? చైనాను ఆక్రమించుకోవటానికా? ఆ భ్రమల్ని వదలాలి. అమెరికా సైన్యంతో కలిసి పోరాడినా.. యుద్ధంలో భారత్ గెలవదు.

- దేశ సార్వభౌమాధికారాన్నిదెబ్బ తీసే ఏ చర్యను చైనా ప్రజలు అంగీకరించరు. వారంతా చైనా ప్రభుత్వం వెంటే ఉన్నారు. చైనాలోని ప్రతి అంగుళాన్ని కాపడే సత్తా ఆర్మీకి ఉంది. సరిహద్దుల్లో భారత్ వి పిల్ల చేష్టలు.ఆ చర్యల్ని చైనా భరిస్తుందని భారత్ అనుకుంటుంది.

- పాంగాంగ్ సరస్సు వద్ద ఘర్షణే చోటు చేసుకుంటే.. భారత సైన్యానికి కొత్త ఓటమి తప్పదు. భారత్ తన మిలటరీ మొత్తాన్ని మూసివేయాలంటే.. వార్ కు రెఢీ కావొచ్చు.

-  యుద్ధమే వస్తే 1962లో జరిగిందే రిపీట్ అవుతుందని.. అప్పటి కంటే ఎక్కువ మరణాల్ని భారత్ మూటకట్టుకుంటుందని పేర్కొంది. సవాళ్ల విషయంలో చైనా సున్నితమైనది కాదని పేర్కొంది.

- గమనించాల్సిన అంశం ఏమంటే.. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ యుద్ధం మీద బలుపు వ్యాఖ్యలు చేస్తే.. అందుకు భిన్నంగా చైనా ప్రభుత్వం మాత్రం.. తాము తొలుత యుద్ధం చేయమని సుద్దులు పలుకుతోంది. ఓవైపు విషం కక్కుతూనే.. మరోవైపు సుద్దులు పలకటం గమనార్హం.
Tags:    

Similar News