గత కొద్దిరోజులుగా వార్తల్లోకి వస్తున్న జీవో నెంబరు 207 ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవటానికి వీలుగా జారీ చేశారన్న విమర్శలు ఉన్న ఈ జీవోపై హైకోర్టు వ్యాఖ్యలు చేయటం.. తెలంగాణ ఏజీ వాదనను తప్పు పట్టటం తెలిసిందే. మరోవైపు.. ఈ జీవో జారీపై హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే.. రాత్రికిరాత్రే ఆ జీవోను రద్దు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. దాని స్థానే ఆర్డినెన్స్ విడుదల చేయటం మరో విశేషం. అసలింతకు జీవో నెంబరు 207 ఏం చెబుతోంది? దీన్ని ఏ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది? దీని వెనుకున్న అసలుకారణం ఏమిటి? తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ఏం చెబుతుందన్న విషయాలు చూస్తే..
అసలీ జీవో 207 ఎందుకు.. ఏమిటి..?
గ్రేటర్ ఎన్నికల్లో గ్రేటర్ కోట మీద గులాబీ జెండా ఎగిరేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 207గా చెప్పొచ్చు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో తుది ఫలితం ఆశించినంత మేర రాకున్నా.. మజ్లిస్ సహకారంతో లేనిపక్షంలో సొంతంగా అయినా గ్రేటర్ లో పాగా వేయటానికి వీలుగా ఎమ్మెల్సీలను ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఓటింగ్ లో పాల్గొనటం మామూలే. అయితే.. వీరి సంఖ్యను భారీగా పెంచటం కోసమే తయారుచేసిన జీవో 207. జీహెచ్ ఎంసీ చట్టం 1955 పరకారం ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసే సమయానికి తమ ఓటు ఎక్కడ ఉందో అక్కడి చిరునామా ఇస్తారు. ఆ చిరునామాలో పేర్కొన్న స్థానిక సంస్థల్లోనే వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.
అయితే.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 207లో.. ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసే సమయంలో పేర్కొన్న చిరునామా కాకుండా.. ఆ తర్వాత ఎప్పుడు అడ్రస్ మార్చుకున్నా వారంతా గ్రేటర్ కుఎక్స్ అఫీషియో సభ్యులుగా మారతారు. ఇందుకు వీలుగా 2015 డిసెంబరు 30న జీవో నెంబరు 207ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
దీని ప్రకారం.. ఎమ్మెల్సీ అయ్యేందుకు నామినేషన్ దాఖలు చేసిన తేదీ.. గవర్నర్ నామినేటెడ్ చేసిన తేదీ అనే సెక్షన్ ను తొలగించింది. దీంతో.. గ్రేటర్ పరిధిలో తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్సీలు (నామినేషన్ వేసిన సమయంలో ఉన్న చిరునామా కాకుండా ప్రస్తుత చిరునామా ప్రకారం గ్రేటర్ పరిధిలోని వారితో పాటు.. గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలు కూడా గ్రేటర్ ఎక్స్ అపీషియో సభ్యులుగా మారిపోయే వీలు కల్పిస్తూ) గ్రేటర్ కు జరిగే మేయర్.. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలు కల్పిస్తుంది.
ఆ తర్వాత ఏమైంది
జీవో నెంబరు 207 జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వ తీరును తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సర్కారు ఈ జీవో ద్వారా నిబంధనల్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
తాజాగా హైకోర్టు ఏమంది?
జీవో నెంబరు 207ను జారీ చేయటానికి వీలుగా విభజన చట్టంలోని 101 సెక్షన్ ను తెలంగాణ సర్కారు ఉపయోగించుకుంది. చట్టసభల ద్వారా జరగాల్సిన సవరణను జీవోల ద్వారా చేయటం ఏమిటంటూ దాసోజు శ్రవణ్ ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వాదనను ఏకీభవిస్తూ సదరు జీవోను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమైంది. చట్ట సవరణ అధికారం ప్రభుత్వానికి లేదని.. చట్టసభల ద్వారానే అది జరగాలని అభిప్రాయపడింది.
ఆ తర్వాత ఏం జరిగింది?
జీవో నెంబరు 207పై హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. ఈ జీవో జారీతో తమకు తలనొప్పులు గ్యారెంటీ అన్న విషయాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ సర్కారు .. నష్టనివారణ చర్యలపై దృష్టి పెట్టింది. తాము జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ.. దాని స్థానే ఆర్డినెన్స్ ను జారీ చేసింది. ఇందుకోసం హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మంత్రులందరి చేత సంతకాలు చేయించారు. సర్క్యులేషన్ అఫ్రూవల్ గా వ్యవహరించే దీని ద్వారా మంత్రుల ఆమోదం తీసుకొని.. ఆఘమేఘాల మీద గవర్నర్ వద్దకు వెళ్లి.. ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఆర్డినెన్స్ జారీ చేశారు.
తాజా ఆర్డినెన్స్ ఏం చెబుతోంది?
హైదరాబాద్ లో ఓటుహక్కు కలిగిన ఎమ్మెల్సీలంతా ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేయర్ ఎన్నికల్లో పాల్గొనే వీలుంది.
ఆర్డినెన్స్ తో ఏమవుతుంది?
జీవో 207తో తలనొప్పులు తెచ్చుకున్న తెలంగాణ సర్కారు.. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో నష్టనివారణ చర్యల్ని షురూ చేసింది. జీవో 207 మీద విచారణ సోమవారం (ఫిబ్రవరి 8) జరగనుంది. జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటంతో హైకోర్టు దీని మీద వ్యాఖ్యలు చేయటం మినహా చర్యలకు అవకాశం ఉండదు. అదే సమయంలో.. జీవో నెంబరు 207 ద్వారా తనదైన శైలిలో లబ్థి పొందాలనుకున్న తెలంగాణ సర్కారుకు ఇప్పుడా వెసులుబాటు ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆర్డినెన్స్ ద్వారా ఎవరికి ఎలాంటి కొత్త ప్రయోజనాలు కల్పించటం లేదన్న విషయాన్ని గవర్నర్ కు స్పష్టంగా చెప్పిన తర్వాతే ఆయన ఆర్డినెన్స్ మీద సంతకం చేసినట్లుగా చెబుతున్నారు. ఇంతా చేస్తే.. తెలంగాణ సర్కారు ఏం కోరుకుందో అది జరగకుండా పోయిందనే చెప్పాలి. మరోవైపు అలాంటిదేమీ లేదని.. జీవోలో పేర్కొన్న సారాంశంతోనే ఆర్డినెన్స్ ను రూపొందించినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉంది.