జూలై నాలుగున మన రాష్ట్రానికి రానున్నారు మోడీ. అంతకుమునుపు రెండు రోజులు ఆయన భాగ్యనగరి (హైద్రాబాద్ ను ఇలానే ర రాయమంటోంది బీజేపీ) లో బీజేపీ జాతీయ స్థాయి సమావేశాల్లో పాల్గొన్నాక ఇటుగా రానున్నారు. ఆయన రాక నేపథ్యంలో నిరసనలు వినిపించేందుకు అక్కడ సాలు మోదీ సంపకు మోదీ అని టీఆర్ఎస్ నేరుగానే ఫ్లెక్సీల రూపంలో తన నిరసనలను తెలియజెపుతోంది.
ఒకనాడు సీబీఎన్ కూడా ఇలానే చేశారు. ఆయన ఓసందర్భంలో విజయవాడకు వచ్చిన సందర్భంలో నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. అప్పట్లో చంద్రబాబు చేసిన పని సంచలనాత్మకం అయింది. ఆ తరువాత బీజేపీ తో బంధాలు పునరుద్ధరణకు ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. అటుపై వీరి దూరాన్ని రాజకీయ అవసరతను గుర్తించి హాయిగా వైసీపీ ఎంటరై బీజేపీతో ఇప్పటికీ అదే బంధాన్ని కొనసాగిస్తోంది.
గతంలో అమలాపురం ఎంపీగా గతంలో పనిచేసిన పండుల రవీంద్రబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఆయన మాత్రం మోడీ సాబ్ భీమవరం వస్తే మాత్రం నిరసనలు తెలపాల్సిందేనని మొన్నటి ఉండి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, భీమవరంలో జులై 4న జరిగే ప్రధాని మోడీ సభలో ప్రత్యేక హోదా కోరుతూ నల్ల జెండాలతో నిరసన తెలపాలని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కోరారు.
ఇప్పుడు దీనిపైనే దుమారం రేగుతోంది.ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు లంకా దినకర్ మండిపడ్డారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా నిరసనలు తెలపాలని సీఎం జగన్ చెప్పారా అని ప్రశ్నిస్తున్నారాయ న. ఢిల్లీలో ఓ విధంగా, గల్లీలో ఓ విధంగా వ్యవహరించకపోతే తక్షణమే వైఎస్.జగన్ చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారాయన.