జీవో ఇచ్చారు.. కానీ ఆ విష‌యం మ‌రిచారా?

Update: 2022-03-08 08:20 GMT
ఏపీలో సినిమా టికెట్ ల‌ని ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే విక్ర‌యించాల‌ని ఇందు కోసం ప్ర‌భుత్వ‌మే ఆన్ లైన్ టికెటింగ్ పోర్ట‌ల్ ని నిర్వ‌హిస్తుంద‌ని గ‌త ఏడాది ప్ర‌త్యేకంగా దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఓ చ‌ట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ మేర‌కు ఓ బిల్లుని ఏపీ ప్ర‌భుత్వం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టి ఆమోదించింది కూడా. అంతే కాకుండా సినిమా టికెట్ లు ఇక‌పై ప్ర‌భుత్వ‌మే విక్ర‌యిస్తుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం టాలీవుడ్ వ‌ర్గాలని విస్మ‌యినికి గురిచేసింది.

కొంత మంది సినిమా షోల‌ని ఇష్టానుసారంగా వేస్తున్నార‌ని, అంతే కాకుండా స్పెష‌ల్ షోల పేరుతో టికెట్ రేట్ల ని భారీగా పెంచేస్తున్నార‌ని, ఇలాంటి వాటిపై నియంత్ర‌ణ తీసుకురావ‌డానికే చ‌ట్టాన్ని తీసుకొస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. అంతే కాకుండా ఇండియ‌న్ రైల్వేస్ టికెట్ల విక్ర‌యం లో అవ‌లంభిస్తున్న‌ ఐఆర్సీటీసీ త‌ర‌హాలోనే సినిమా టికెట్ ల‌ను ఆన్ లైన్ లో విక్ర‌యించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న ఆన్ లైన్ మూవీ టికెట్ బుకింగ్ విధానం అంద‌రికి అందుబాటులో సౌక‌ర్య‌వంతంగా వుంటుంద‌ని, మొబైల్‌, ఇంట‌ర్నెట్ , ఎస్ ఎం ఎస్ ద్వారా ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చిన సినిమా టికెట్ల‌ని బుక్ చేసుకునే అవ‌కాశం వుంద‌ని తెలిపారు.

ఇదిలా వుంటే ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెటింగ్ విధానంపై పాత జీవోని స‌వ‌రిస్తూ కొత్త జీవోని విడుద‌ల చేసింది. పెద్ద చిత్రాలు టికెట్ రేట్ల‌ని పెంచుకునే విధంగా వెసులుబాటుని క‌ల్పిస్తూ తాజా జీవోని విడుద‌ల చేశారు. అయితే అందులో ఆన్ లైన్ టికెటింగ్ విధానం గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కావాల‌నే ఏపీ ప్ర‌భుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం గురించి మ‌ర్చిపోయిందా?  లేక ఆ అంశాన్నే మ‌ర్చిపోయిందా? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గ‌తంలో సీరియ‌స్ గా ఆన్ లైన్ టికెటింగ్ పై అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్ర‌భుత్వం టికెటింగ్ విధానం కు సంబంధించిన జీవోలో ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెట్ట‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా జీవో రెండు భారీ చిత్రాల‌కు ఇప్ప‌డు వ‌రంగా మార‌బోతోంది. మార్చి 11న భారీ స్థాయిలో ప్ర‌భాస్ న‌టించిన 'రాధేశ్యామ్‌' విడుద‌ల కాబోతున్న విష‌య‌మం తెలిసిందే.

తాజా జీవో ఈ చిత్రానికి బాగా ప్ల‌స్ కాబోతోంది. దీని వ‌ల్లే ఈ మూవీ క‌లెక్ష‌న్ లు కూడా పెరిగే అవ‌కాశం వుంది. ఓపెనింగ్స్ భీభ‌త్సంగా వుండ‌బోతున్నాయ‌ట‌. ఇక ఈ మూవీ త‌రువాత అదే ఊపులో 'ఆర్ ఆర్ ఆర్‌' రిలీజ్ కాబోతోంది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన ఈ మూవీ కి తాజా ఏపీ టికెట్‌ జీవో మ‌రింత ఊపునివ్వ‌డం ఖాయం అంటున్నారు.
Tags:    

Similar News