ఉదయం ఐసీయూలో ఉన్న వ్యక్తి.. మధ్యాహాన్నానికి డిశ్చార్జ్ అవుతారా? అంటే.. సాధ్యమే కాదంటారు. కానీ.. తాజాగా అలాంటి వైనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో చోటు చేసుకోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన కొద్ది కాలంగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ తీవ్ర అస్వస్థతకు గురి కావటం.. ఆసుపత్రిలో చికిత్స పొందటం తెలిసిందే. కొన్ని నెలలుగా ఆయన ఆసుపత్రిలోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
ఒకదశలో ఆయన్ను విదేశాలకు తీసుకెళ్లి మరీ ట్రీట్ మెంట్ ఇప్పించారు. అయితే.. ఆ మధ్యన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించి చికిత్స జరిపారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గడిచిన కొద్ది కాలంగా ఎయిమ్స్ లోని ఐసీయూలో ఉన్న ఆయన్ను ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
డిశ్చార్జ్ కావటానికి ముందు వరకూ ఐసీయూలో చికిత్స పొందిన గోవా ముఖ్యమంత్రి.. అనూహ్యంగా డిశ్చార్జ్ కావటం ఆయన్ను ప్రత్యేక విమానంలో గోవాకు పంపారు. మనోహర్ పారీకర్ ఆరోగ్యం కుదుట పడిందని.. అయితే.. ఆయనకు కొంత విశ్రాంతి అవసరమని చెబుతున్నారు. మధ్యాహ్నం వరకూ ఐసీయూలో ఉన్న వ్యక్తిని.. వెంటనే డిశ్చార్జ్ చేయటం ఆసక్తికరంగా మారింది.
ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరిన గోవా సీఎం.. ప్రత్యేక విమానంలో తన ఇంటికి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆయన్నుపలువురు ప్రముఖులు పరామర్శించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న పారీకర్ తాజాగా కుదుటపడ్డారంటూ చోటు చేసుకుంటున్న పరిణామాలు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయినా.. ఉదయం ఐసీయూలో ఉండి.. మధ్యాహ్నం డిశ్చార్జ్ కావటం అందరికీ సాధ్యమేనా?