గోవా ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అవసరాల కోసం పరిమితస్ధాయిలో గంజాయిని సాగుచేసేందుకు తమ ప్రభుత్వం అనుమతించినట్లు న్యాయశాఖ మంత్రి నీలేష్ కాబ్రాల్ చెప్పటం సంచలనంగా మారింది. మందుల తయారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పరిమిత స్ధాయిలోనే మారిజువానా (గంజాయి) సాగుకు అనుమతించాలని వైద్య ఆరోగ్య శాఖ నుండి రిక్వెస్టు వచ్చిందట. ఆ రిక్వస్టును పరిశీలించిన తర్వాత సాగుకు అనుమతించాలని డిసైడ్ చేసినట్లు చెప్పారు.
1985లో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోటోపిక్ సబ్ స్టాన్సెస్ కింద గంజాయిని నిషేధిత జాబితాలో చేర్చినట్లు మంత్రి చెప్పారు. సాగుకు అనుమతించిన పరిమితిలోనే ఫార్మా కంపెనీలకు గంజాయి అమ్ముతామని చెప్పారు. గంజాయి సాగు విషయంలో ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకుంటుంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు.
గోవా కాంగ్రెస్ ప్రతినిధి అమరనాధ్ పంజికర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అగాధంలోకి కూరుకుపోయిందంటు ఆరోపణలు గుప్పించారు. గంజాయి సాగు విషయంలో ప్రభుత్వ చర్యలపై మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజంలోకి డ్రగ్స్ మరింత విరివిగా దొరికేందుకు దోహడపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో స్వతంత్ర ఎంఎల్ఏ రోహన్ కౌంటీ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గోవా వాతావరణాన్ని ప్రభుత్వ నిర్ణయం కలుషితం చేసేస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు.