విమానాన్నిపేల్చేస్తాం..క్ష‌మాప‌ణ కోరిన పైలెట్లు

Update: 2018-02-19 12:30 GMT
సరిగ్గా నెల‌రోజుల క్రితం విమానాన్ని గాలికి వదిలేసి పరస్పరం ఘర్షణకు దిగిన ఇద్దరు పైలెట్లు అందులో ఉన్న ప్రయాణికులను బెంబేలెత్తించిన విష‌యం తెలిసిందే. జనవరి 1న  లండన్ నుంచి ముంబై వచ్చిన జెట్ ఎయిర్‌ వేస్ విమానంలో  సమాచార మార్పిడిలో లోపం కారణంగా కాక్‌ పిట్‌ లో ఉన్న పైలెట్ల మధ్య చిన్న వివాదం తలెత్తింది. ఆ వివాదం ముద‌ర‌డంతో విమానంలో ఉన్న ప్ర‌యాణికుల్ని గాలికొదిలేసిన పైలెట్లు ఒక‌రిపై ఒక‌రు ప‌రస్పరం దాడి చేసుకున్నారు. అయితే పైలెట్లు తీరుతో బెంబేలెత్తిన ప్ర‌యాణికులు అధికారుల‌కు స‌మాచారం అందించారు. దీంతో  విషయం తెలుసుకున్న జెట్ ఎయిర్‌ వేస్ ఆ ఇద్దరు పైలెట్లను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించి, విచారణ చేపట్టింది.

ఆ ఘ‌ట‌న‌పై విచార‌ణ కొన‌సాగుతుండ‌గా గోఎయిర్ సంస్థకు చెందిన పైలెట్లు ప్ర‌యాణికుల్ని బెదిరించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.  అంతేకాదు వీడియోలు తీసి పోస్ట్ చేస్తే విమానాన్ని దారి మ‌ధ్యలోనే పేలుస్తారంటూ ప్ర‌యాణికుల్ని భ‌యాందోళ‌న‌కు గురిచేశారు.

ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్లు - ప్రయాణికుల మధ్య ఊహించని వివాదం రేగింది. గోఎయిర్ సంస్థకు చెందిన జీ8 113 విమానం ఉదయం 5.50కి బయల్దేరాల్సి ఉంది. ప్రయాణికులంతా 5.10 నుంచే రావడం మొదలు పెట్టారు. కానీ ప్ర‌యాణికుల‌కంటే ముందుగా ఉండాల్సిన పైలెట్లే ఉద‌యం 7గంట‌ల‌కు రావ‌డంతో 185 ప్ర‌యాణికులు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తాము ఉద‌యం 6గంట‌ల‌కే వ‌చ్చామ‌ని - మీకెందుకు ఇంత లేట్ అయింద‌ని కోపంతో ఊగిపోయారు - కేక‌లు వేశారు.అయితే తాము ఆల‌స్యం చేయ‌లేద‌ని - యాజ‌మాన్య స‌మ‌స్య‌ల వ‌ల్లే తాము ఆల‌స్యంగా రావాల్సి వ‌చ్చిందంటూ క్ష‌మాప‌ణ‌లు కోరారు.

 అయినా ప్ర‌యాణికులు వినిపించుకోలేదు. ఇ త‌తంగాన్ని కొంద‌రు ప్ర‌యాణికులు వీడియోలు తీసి పోస్ట్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అంతలో ఓ ప్రయాణికుడు వీడియోల్ని తీస్తే పేలుస్తార‌ని పైలెట్లు అంటున్నార‌ని మిగిలిన వారికి చెప్ప‌డంతో క‌ల‌కలం రేగింది. దీంతో ఆ పైలెట్లు మాకొద్దు బాబోయ్..కొత్త‌పైలెట్ల‌ను పెట్టండి అని ప్ర‌యాణికులు మొర‌పెట్టుకున్నారు.

 ఇదేం ప‌ట్టించుకోని సద‌రు సంస్థ ఆ పైలెట్ల‌ను ఉంచింది. రకరకాల తర్జనభర్జనల తర్వాత 8:40 బయల్దేరింది. బెంగళూరు వచ్చేసరికి 11.20 సమయం అయ్యింది. అయితే పైలెట్ల బెదిరింపుల‌పై తాము విచార‌ణ చేప‌ట్టామ‌ని -  వారు ఎలాంటి బెదిరింపులకు దిగలేదని గో ఎయిర్ వెల్లడించింది.
Tags:    

Similar News