“హార్ట్ఫోర్డ్ లో గోదావరి కొత్త రెస్టారంట్”

Update: 2016-09-02 13:30 GMT
యూఎస్ ఏ - జూలై 29 - 2016: అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న గోదావరి సౌత్ ఇండియన్ రెస్టారెంట్  చైన్ ఇప్పుడు హార్ట్ఫోర్డ్ లో సరికొత్త రెస్టారంట్ ప్రారంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పుష్కరాలను పురస్కరించుకుని “పుష్కర” అనే బాంక్వెట్ హాల్ ఇందులో భాగంగా ఉంటుంది. దీనితో పాటు గోదావరి కల్లు కాంపౌండ్ పేరిట బార్ కూడా అందుబాటులో ఉంటుంది.

న్యూ ఇంగ్లాండ్ మేయర్ చేతుల మీదుగా ప్రారంభించబడే ఈ రెస్టారెంట్లో "గోదావారి మీ ఇష్టం" పేరు మీద అద్భుత బఫెట్ అందుబాటులో ఉంటుంది. ఈ బఫెట్ లో బెజవాడ బ్రెడ్ వేపుడు - పక్కింటి పాలకూర పప్పు - అమల ఆవకాయ కోరమీను పులుసు - సీమ కోడి వేపుడు - బొమ్మిడాయిల పులుసు - మాంసం రోస్ట్ పులావు - రాయలసీమ రాగి సంకటి వంటి వంటకాలను రుచి చూడవచ్చు.

మొదటి సారి బార్ ని అందుబాటులోకి తెచ్చిన గోదావరి మండపేట మార్టిని - బాపట్ల బకార్డి బ్లాస్ట్ - అల్లం విస్కీ పేరిట వెరైటీ డ్రింక్స్ అందిస్తోంది.

హార్ట్ఫోర్డ్ ప్రధాన వాణిజ్య ప్రాంతానికి కేవలం పది నిముషాల దూరంలో ఉన్న గోదావరి రెస్టారంట్ అక్కడి కార్పొరేట్ ఆఫీసులకు - ప్రధానంగా ఇండియన్ కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రాంచైజ్ యజమాని శ్రీకాంత్" హార్ట్ఫోర్డ్ లో గోదావరిని అందుబాటులోకి తేవటం చాలా ఆనందంగా ఉంది. భారత దేశపు వంటకాలు అందుబాటులో లేని వేళ గోదావరి ఆ లోటుని తీరుస్తుంది. మన వారికి బాంక్వెట్ హాల్ ని అందుబాటు ధరల్లోని అందిస్తాం" అని అన్నారు.

హార్ట్ఫోర్డ్ ఫ్రాంచైజ్ కి చెందిన తేజ రావెళ్ల ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇండియన్ వంటకాలు మన దేశం వారికి అందించటం ఎంతో గర్వంగా ఉందన్నారు.

గోదావరి చికాగో యజమాని మరియు నార్త్ ఈస్ట్ ఆపరేషన్స్ హెడ్ వరుణ్ మేడిశెట్టి మాట్లాడుతూ - "గోదావరి చైన్ లో భాగం కావటానికి మాత్రమే కాకుండా అమెరికా నగరాల్లో ఈ రెస్టారెంట్లు పెట్టమని మమ్మల్ని ఎంతో మంది అడుగుతున్నారు. మా గోదావరి అమెరికాలోని ప్రతి నగరంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా గలగల పారాలని మేము ప్రయతిస్తున్నాం, ఆ దిశగా పని చేస్తున్నాం. క్రొత్తదాన్ని చిరునామాగా కొత్త వంటలకి మారుపేరుగా మేము ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

కొన్నిరోజుల క్రితం ప్రారంభమైన గోదావరి "మొఱ్ఱిస్విల్లే "ఎంతో ఆదరణ పొందుతోంది. ఆ ఆరంభ వేడుకలను ఈ కింది లింకులో చూడవచ్చు: https://www.youtube.com/watch?v=7jAG_GfLt0Q

వచ్చే నెల గోదావరి Rhode Island - Charlotte మరియు వాషింగ్టన్ డీసీ ప్రాంతాల్లో ప్రారంభమవుతున్నాయి. అతి త్వరలో ప్రపంచంలోని మరిన్ని నగరాల్లో గోదావరి భోజన ప్రియులను అలరించబోతోంది.

"భోజన ప్రియులే కాకుండా వంట చేయటం హాబీగా ఉన్న వారు, కొత్త వంటకాల్ని వండేవారు వారి రెసిపీలను గోదావరి పంపి - మరిన్ని భారతీయ రుచులను ఇక్కడి ఇండియన్లకి అందియ్యటంలో పాలుపంచుకొవచ్చు. ఇది మా ప్రయత్నంలో ఒక ముఖ్య భాగం" అని ప్రమోటర్లు అన్నారు.

ఈ నెల 03 నుంచి మీకు ఆత్మీయ‌త‌ను పంచేందుకు సిద్ధం.

Godavari Hartford

1250 Burnside Avenue
East Hartford, CT-06108
Ph: 860-289-2704

మా సేవలతో మీరు సదా ఆనందించగలరని ఆశిస్తూ మరోసారి కృతజ్ఞతలు.

సంప్ర‌దించండి:

Teja Ravella

475-441-1179
Hartford@GodavariUS.com
www.GodavariUS.com


Press note released by: Indian Clicks, LLC
Tags:    

Similar News