గోదావరి పుష్కరాల సందర్భంగా రానున్న మూడు రోజులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అదికారుల్లో గుబులు రేపుతోంది. గురువారం అమావాస్య కావటంతో పుష్కర స్నానం చేసే భక్త జన సందడి పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. ఇక.. శుక్రవారంతో మొదలయ్యే సందడి.. ఆదివారం వరకూ కొనసాగుతుందని చెబుతున్నారు.
అమావాస్య తర్వాత రోజుతో పాటు.. శుక్రవారం ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే.. శనివారం రంజాన్.. ఆదివారం మామూలుగానే సెలవురోజు కావటంతో.. భక్తజన సందడి భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు సైతం.. ఈ మూడు రోజుల్లో ఎక్కువగా వచ్చే వీలుందని భావిస్తున్నారు. దీంతో.. పుష్కరాల్లో ఈ మూడు రోజులు చాలా కీలకం అన్న భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. వరుసగా వచ్చే సెలవులతో పుష్కర స్నానం కోసం భక్తులు పోటెత్తటం ఖాయంగా చెబుతున్నారు.
తెలంగాణ జిల్లాలలో పోలిస్తే.. ఏపీలోని రాజమండ్రిలో ఎండలు మండుతున్న పరిస్థితి. దీంతో.. పుష్కర స్నానం కోసం వస్తున్న భక్తులు.. చెమటలు.. వేడి తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న మూడు రోజుల్లో భక్తజన సందడి భారీగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో.. ప్రత్యేక ఏర్పాట్ల దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రిలో మండుతున్న ఎండల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నరు. అధికారులు చెబుతున్న మాటల్లో నిజం ఎంతన్నది ఆదివారం పూర్తయితే కానీ తెలీని పరిస్థితి.