గోదావరి పుష్కరాలు రెండో రోజూ పూర్తయింది. తొలి రోజున చోటు చేసుకున్న తొక్కిసలాట ఏపీ పుష్కరాల మీద ప్రభావం చూపింది. తొలిరోజు రాజమండ్రిలో పది లక్షల (10.26లక్షలు) మంది పుష్కర స్నానం ఆచరిస్తే.. తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో భక్త జనం అప్రమత్తమైంది. ఉత్తంగ కెరటంలా తొలిరోజు భక్తులు పోటెత్తితే.. రోండు రోజు మాత్రం భక్తుల సందడి బాగా తగ్గింది. అధికారుల అంచనా ప్రకారం.. కేవలం ఆరు లక్షల మంది మాత్రమే పుష్కర స్నానం చేసినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక రాజమండ్రి కాకుండా జిల్లాలోని మిగిలిన ఘాట్లలో 5.40లక్షల మంది.. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కొవ్వూరు.. నర్సాపురం.. ధవళేశ్వరంలోని రామపాదాల రేవు తదితర దగ్గర మొత్తం కలిపి 11.88 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్లుగా చెబుతున్నారు.
తొలిరోజు చోటు చేసుకున్న విషాదం భక్తులపై ప్రభావం చూపింది. ప్రధాన స్నానఘాట్ అయిన రాజమండ్రిలో భక్తులు పల్చగా కనిపించారు. పుష్కర ఉత్సాహం స్థానే.. ఒకలాంటి గంభీర వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. కొవ్వూరు గోస్పాడు.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ రేవుకు భక్తుల సందడి పెరిగింది. దీంతో మొదటిరోజు కళకళలాడిన రాజమహేంద్ర నగరం.. బుధవారం బోసి పోయింది.
ఇక.. తెలంగాణలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మొదటి రోజు ఓ మోస్తరుగా ఉన్న భక్తజనం.. రెండో రోజు ఐదు జిల్లాల్లోని పుష్కర ఘాట్లు కళకళలాడాయి. బుధవారం సాయంత్రం నుంచి అమావాస్య తిథి స్టార్ట్ అయి.. గురువారం మొత్తం ఉంటున్న నేపథ్యంలో.. భక్తులు ముందే పుణ్య స్నానాలు ఆచరించారు. ఐదుజిల్లాల్లో ఖమ్మం జిల్లాలోని భద్రాద్రిలో భారీగా భక్తజన సందోహం కనిపించింది. అధికారుల అంచనా ప్రకారం.. కరీంనగర్ జిల్లా ధర్మపురి.. కాళేశ్వరం.. మంథని.. కోటి లింగాల ఘాట్ లలో 7లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. నిజామాబాద్ బాసర క్షేత్రంలో దాదాపు లక్ష మంది పైగా స్నానాలు చేశారు. ఇక్కడకు వచ్చిన భక్తులలో కర్ణాటక.. మహారాష్ట్ర భక్తుల జనసందోహం ఎక్కువగా కనిపించింది.