గత నాలుగు దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు, యువత ఉన్నత విద్యకు అయినా, ఉన్నత ఉద్యోగాలకు అయినా అమెరికాకు వెళ్లడం కామన్. ఎవరైనా సరే అమెరికా వెళుతున్నారంటే వారి బంధువులు, సన్నిహితుల్లో ఎంతో గొప్ప. అయితే ఇదంతా గతం... ఇప్పుడు అమెరికా వెళ్లడం అంటే చిన్నచూపు చూస్తోన్న పరిస్థితి.
అమెరికా గొప్పతనం ప్రపంచ వ్యాప్తంగానే కాదు... మన దేశంలోనూ.. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ ప్రజల్లోనూ చులకన అయిపోయింది. ఇప్పుడు అమెరికా అంటే మనోళ్లకు మొహం మెత్తేస్తోంది. అమెరికా వైపు చూసేందుకు కూడా ఎవ్వరూ ఇష్టపడని పరిస్థితి.
అయితే ఇందుకు ప్రధాన కారణం కాలం చెల్లిన అమెరికా H-1B వీసా విధానాలే అని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు భారతదేశ మేథావులు, ప్రతిభావంతులు అయిన యువత అంతా అమెరికాకు వచ్చి అమెరికా దేశ సంపదను పెంచే విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు.
అయితే ఇప్పుడు ఈ ప్రతిభ అంతా కెనడాకు వలస వెళ్లిపోతోన్న పరిస్థితి. H-1B విసాలపై అగ్రరాజ్యం అనుసరిస్తోన్న విధానాలతో విసుగుచెందే అమెరికాకు వచ్చేందుకు, ఇక్కడ ఉండేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదు. ఇక కెనడాలో వీసా నిబంధనలు సరళంగా ఉండడంతో ఇప్పుడు మనదేశ మేథావులు అందరూ అటు వైపు చూస్తోన్న పరిస్థితి.
ఇదే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు చట్ట సభ్యులకు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరి కొన్నేళ్లలోనే అమెరికాను అనేక విషయాల్లో కెనడా ఖచ్చితంగా బీట్ చేస్తుందన్న ఆందోళన కూడా అమెరికాలో వ్యక్తమవుతోంది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస హోదా లాంటి అంశాలు ప్రతి ఒక్కరు కెనడా వెళ్లే ఆలోచనకు కారణమవుతున్నాయి. అదే అమెరికాలో గ్రీన్‌కార్డు, శాశ్వత నివాసం విషయంలో నిబంధనలు కఠినతరంగా ఉండడంతో ఇప్పుడు ఎవ్వరూ ఇక్కడకు వచ్చేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదట.
ఈ నిబంధనల ప్రకారం చూస్తే ఉపాధి అధారిత గ్రీన్‌కార్డు కోసం 20 లక్షల మంది వరకు మరో దశాబ్దం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా భారతీయుల ప్రతిభ కెనడాకు తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఇమ్మిగ్రేషన్ అధికారులు కాంగ్రెస్‌ను కోరారు. ఇక ఇటీవల లెక్కలు చూస్తే కెనడా విశ్వవిద్యాలయాలకు వెళ్లే భారతీయుల సంఖ్య 2016 లో 76,075 నుంచి 2018 లో 1,72,625 కు పెరిగింది. ఈ పెరుగుదల 127 శాతంగా ఉంది. ఇదే సమయంలో అమెరికా వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది.