వజ్రాలు పొదిగిన బంగారు కమోడ్ .. ఖరీదెంతో తెలుసా ?

Update: 2019-11-07 06:57 GMT
డబ్బులు లేని వాడు తినడానికి తిండి లేక ఇబ్బందులు పండుతుంటే .. డబ్బులు అధికంగా ఉన్నవాడు ఆ డబ్బుని ఎలా ఖర్చుపెట్టాలా అని ఆలోచిస్తుంటారు. ఆలా కొన్ని కొన్ని సార్లు కొంతమందికి  విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. బాత్ రూమ్ కమోడ్ మాములుగా మట్టితో , ప్లాస్టిక్ తో తయారుచేస్తారు. కానీ , తాజాగా ఒకరు .. సుమారుగా 40 వేల వజ్రాలతో బాత్ రూమ్ కమోడ్ ని తయారు చేసారు. బాత్ రూమ్ లోకి వెళ్లి రావడానికి .మట్టి అయితే ఏంటి ..వజ్రాలు అయితే ఏంటి ..దేనితో తయారు  చేసినా ఆ కమోడ్ ని బాత్ రూమ్ లోనే పెట్టుకుంటాం తప్ప .. దేవుని గదిలో పెట్టుకోలేము కదా. కానీ , ఎవరి ఆనందం వారిది. లక్షలు పోసి చెప్పులు కొన్నా కూడా కాళ్ళకే వేసుకుంటాం కానీ , లక్షలు పోసి కొన్నాం కదా అని నెత్తిన పెట్టుకొని నడవం కదా ..ఇది అంతే ..అసలు ఈ బాత్ కమోడ్ ని ఎవరు తయారు చేసారు ? ఎందుకు తయారు చేసారు ? దీన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అయ్యిందో ఇప్పుడు చూద్దాం..

చైనాలోని షాంఘైలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వజ్రాలతో తయారుచేసిన కమోడ్ ని  ప్రదర్శనకు ఉంచారు. దీని ప్రత్యేకతలు చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ టాయ్‌లెట్‌ పైభాగంలో కూర్చోడానికి దాదాపు 40వేలకు పైగా వజ్రాలతో బుల్లెట్‌ ప్రూఫ్‌ సీటును తయారు చేశారు. ఈ కమోడ్ యొక్క విలువ సుమారుగా రూ.9 కోట్లు. ఈ టాయ్‌లెట్‌ను హాంగ్‌కాంగ్‌కు చెందిన కోరోనెట్‌ అనే నగల దుకాణ యజమాని ఆరోన్‌ షమ్‌ రూపొందించారు. దాన్ని అమ్మకానికి ఉంచలేదని కేవలం ప్రదర్శనకు ఉంచినట్టు అయన తెలిపారు. ఈ వజ్రాలతో పొదిగిన బంగారపు టాయ్‌లెట్‌ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Tags:    

Similar News