సంగీతా చటర్జీ పేరు గుర్తుకొచ్చిందా? బాగా తెలిసిన పేరులా ఉందే అనిపించిందా? ఒక్క విషయాన్ని గుర్తుకు చేస్తే చాలు.. చప్పున గుర్తుకు వచ్చేస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణా ఇష్యూలో మాజీ మోడల్ మాఫియా క్వీన్ గా మారిన వైనంపై ఆధారాలు సేకరించి.. ఆమెను అరెస్ట్ చేయటానికి చిత్తూరు పోలీసులు కోల్ కతాకు వెళ్లటం.. ఆమెను అదుపులోకి తీసుకున్న వెంటనే డజన్ కు పైగా లాయర్లు కోర్టులో వాదనలు వినిపించి క్షణాల్లో ఆమెకు బెయిల్ వచ్చేయటం.. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?
ఎర్రచందనం స్మగ్లర్ మార్కొండ లక్ష్మణ్ రెండో భార్య అయిన ఈ మాజీ మోడల్.. లక్ష్మణ్ అరెస్ట్ అయిన తర్వాత వ్యాపారాన్ని టేకోవర్ చేయటమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో అమ్మడి రేంజ్ గురించిన వివరాలు సేకరించిన పోలీసులు షాక్ తిన్న పరిస్థితి. ప్రస్తుతం పోలీసులకు అందుబాటులోకి లేకుండా పోయిన ఈమెకు చెందిన బ్యాంక్ లాకర్లను చిత్తూరు పోలీసులు బ్రేక్ చేశారు.
ఈ లాకర్లలో దాదాపు కోటి రూపాయిలకు పైగా బంగారు నగలు.. పలు కీలక డాక్యుమెంట్లు లభించినట్లుగా చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ ను 2014లో పోలీసులు అరెస్ట్ చేసి.. విచారించగా ఈ రెడ్ రోజ్ వుడ్ క్వీన్ గురించి పోలీసులు తొలిసారి విన్నారు. ఎర్రచందనాన్ని అమ్మిన సొమ్మును తన సహాయకుడి ద్వారా సంగీతకు పంపినట్లుగా లక్ష్మణ్ ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు చెందిన బ్యాంక్ లాకర్లను గుర్తించిన చిత్తూరు పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకొని.. బ్రేక్చేసి.. బంగారు.. వెండి ఆభరణాలు.. డాక్యుమెంట్లు.. ఫారిన్ మనీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపు నుంచి బెయిల్ తో బయటపడ్డ ఈ మాఫియా క్వీన్ ఇప్పటివరకూ పత్తా లేకపోవటం తెలిసేందే. ఈమెను ఎలాగైనా అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న చిత్తూరుపోలీసులు మరోసారి ఆమె కోసం కోల్ కతా బయలుదేరారు. మరి.. ఈసారైనా విజయం వారిని వరిస్తుందా? లేడీ మాఫీయా క్వీన్ అరెస్ట్ అవుతుందా? అన్నవి ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి.