ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ప్రజలని ఆకర్షించడానికి సరికొత్త పథకాలతో ముందుకు వస్తున్నాయి. అలాగే అన్ని సార్లు పథకాలు ..ఓట్ల కోసం కాకుండా , మంచి చేయాలనే లక్ష్యం తోను ప్రారంభిస్తారు. ఈ కోణంలోనే అసోం ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఒకప్పుడు దేశంలో బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరిగేవి , కానీ ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టినా ఇంకా అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ బాల్య వివాహాలను ఆపేందుకు, అమ్మాయిలను చదువుల దిశగా ప్రోత్సహించేందుకు కాస్త వినూత్నంగా ఆలోచించింది అసోం ప్రభుత్వం.
రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయికు 10 గ్రాముల బంగారం పెళ్లి కానుకగా అందించేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టుంది. ఈ పథకానికి 'అరుంధతి బంగారు పథకం’ అనే పేరుతో తీసుకువచ్చారు. ఈ పథకం కోసం ఏడాదికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఈ పథకానికి ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.
అలాగే ఈ పథకం యొక్క విధి విధానాలని కూడా ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పెళ్లి కూతురికి బంగారాన్ని డైరెక్ట్‌గా ఇవ్వకుండా.. రూ. 30 వేల నగదును ప్రభుత్వం వధువు అకౌంట్‌లో డిపాజిట్ చేస్తుంది. ఇకపై ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో..అప్పుడు ఉన్న బంగారం ఖరీదును బట్టి..పథకం ద్వారా ఇచ్చే నగదులో మార్పులు ఉంటాయి అని మంత్రి తెలిపారు.
ఈ పథకానికి అప్లై చేయాలి అంటే కావాల్సిన అర్హతలు :
కనీస వివాహ వయస్సు వధువు (18), వరుడు (21) ఏళ్లు ఉండాలి..
వధువు కనీసం 10వ తరగతి వరకు చదువుకొని ఉండాలి.
వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయించాలి.
వధువు సంరక్షకులు (తండ్రి, తల్లి) వార్షిక ఆదాయం రూ. 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి.
మొదటి వివాహమై ఉండాలి.