యూరోపియన్ యూనియన్ సమాఖ్య నుంచి బయటకు వెళ్లాలన్న నిర్ణయాన్ని బ్రిటన్ ప్రజలు అభిప్రాయ సేకరణ ద్వారా స్పష్టం చేసిన నేపథ్యంలో బంగారం ధర దూసుకెళ్లింది. బ్రిగ్జిట్ కు అనుకూలంగా ఓట్లు వేసిన పక్షంలో షేర్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితం కావటంతో పాటు.. బంగారం.. వెండి ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలకు తగ్గట్లే.. ధరలు భారీగా పెరిగాయి.
ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే పది గ్రాముల బంగారం ఏకంగా రూ.2వేలు పెరగటం గమనార్హం. దీంతో.. పది గ్రాముల బంగారం రూ.32,103కు చేరుకుంది. ఇది 26 నెలల గరిష్ఠ ధరగా చెప్పొచ్చు. భారీగా ధర పెరగటం ఒక్క బంగారానికే పరిమితం కాలేదు. వెండి ధర కూడా భారీగా పెరిగింది. బ్రెగ్జిట్ పుణ్యమా అని ఒక్క రోజులోనే కిలో వెండి వెయ్యి వరకూ పెరిగింది. దీంతో.. వెండి ధర కేజీ రూ.42,300లకు చేరకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో మరికొంత మేర ధర పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.