మాఘ‌మాసం దాటినా,ప‌సిడి ధ‌ర ఆల్ టైమ్ దిశ‌గా!

Update: 2020-03-04 08:15 GMT
మాఘ‌మాసం.. ముహూర్తాల స‌మ‌యం. పెళ్లిళ్ల మ‌స‌యం. దీంతో స‌హ‌జంగానే బంగారానికి డిమాండ్ ఎక్కువ‌. ఫ‌లితంగా ఆ నెల రోజుల పాటు ప్ర‌తియేటా బంగారం ధ‌ర ప‌తాక స్థాయికి చేరుతూ ఉంటుంది. ఇటీవ‌ల మాఘ‌మాసం స‌మ‌యంలో బంగారం ధ‌ర ప‌తాక స్థాయికి చేర‌డంతో.. అంతా ఆ నెల ప్ర‌భావ‌మే అని అనుకున్నారు. అయితే మాఘ‌మాసం దాటిపోయినా.. ప‌సిడి ధ‌ర‌కు మాత్రం ప‌గ్గాలు ప‌డ‌టం లేదు!

ప‌ది గ్రాముల బంగారం ధ‌ర ఇప్పుడు 44,000 రూపాయ‌ల‌కు చేర‌డం సంచ‌ల‌నంగా మారుతోంది సామాన్య ప్ర‌జ‌ల మ‌ధ్య‌న‌. ఇలా బంగారం ఆల్ టైమ్ హై దిశ‌గా సాగుతూ ఉంది. పెళ్లిళ్ల సీజ‌న్ దాటిన త‌ర్వాత బంగారం ధ‌ర త‌గ్గుతుంద‌ని భారతీయులు అనుకున్నారు. అయితే ఇంత‌లో అంత‌ర్జాతీయ ప‌రిణామాలు బంగారం ధ‌ర‌ను మ‌రింత‌గా పెంచేస్తూ ఉన్నాయ‌ని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

డాల‌ర్ తో రూపాయి మారకం విలువ మ‌రింత ప‌త‌నం అయ్యింద‌ని, మ‌రో వంద పైస‌లు త‌గ్గిందంటే అది ఆల్ టైమ్ లో కి చేరుతుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ప్ర‌భావం కూడా బంగారం ధ‌ర పెరిగిపోవ‌డానికి ఒక కార‌ణంగా చెబుతున్నారు. ఇక క‌రోనా వైర‌స్ తో మార్కెట్ లోని వివిధ షేర్ల ప‌త‌నంతో.. బంగారంపై పెట్టుబ‌డులు పెర‌గ‌డం కూడా ధ‌ర పెరుగుద‌ల‌కు మ‌రో కార‌ణంగా తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల‌తో.. తులం బంగారం ఇప్పుడు 44 వేల రూపాయ‌ల వ‌ర‌కూ
చేరిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఊపులో బంగారం ఇది వ‌ర‌కూ ఎన్న‌డూ చూడ‌ని ధ‌ర‌ను చేరుకుంది. ముందు ముందు అయినా బంగారం ధ‌ర ఏమైనా త‌గ్గుతుందా లేక‌.. ఈ స్థాయిలోకి వెళ్లి సెటిలయిపోయి, ముందు ముందు మ‌రింత‌గా పెరిగిపోతుందా అనేది జ‌న‌సామాన్యానికి అంతుబ‌ట్ట‌ని అంశంగా మారుతోంది!


Tags:    

Similar News