చరిత్ర చూడని మాంద్యాన్ని ఎదుర్కోబోతోన్న భారత్

Update: 2020-05-18 10:50 GMT
మహమ్మారి దేశంలో రోజురోజుకి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే , ఈ మహమ్మారి కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ తో గత రెండు నెలలుగా దేశం వ్యాప్తంగా వాణిజ్య ,ఆర్ధిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.ఇటువంటి నేపథ్యంలో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా మాంద్యాన్ని ఎదుర్కోబోతుందని గోల్డ్ మన్ శాక్స్ గ్రూప్ అంచనా వేసింది. గడిచిన మూడు నెలల ను పరిశీలిస్తే..ప్రస్తుతం రెండో టైం త్రైమాసికం నాటికి దేశ జి.డి.పి 45 శాతానికి పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఇంతకు ముందు ఇచ్చిన నివేదికలో మాత్రం కేవలం 20 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేసింది.

అయితే, మూడో త్రైమాసికం నాటికి మళ్లీ జి.డి.పి 20 శాతం పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా నాలుగో త్రైమాసికంలో 14 % ,వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో 6.5% వద్ద స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం వచ్చే ఏడాది 2021 ఆర్థిక సంవత్సరం నాటికి వాస్తవ జీడీపీ 5 శాతం క్షీణించి అవకాశం ఉందని గోల్డ్ మన్ శాక్స్ ఆర్థిక నిపుణులు ప్రఛీ మిశ్రా అంచనా వేశారు. అయితే ఇలాంటి మాంద్యాన్ని భారత్ గతంలో ఎన్నడూ ఎదురు లేదని తమ నివేదికలో పొందుపరిచారు. ఈ సమయంలో ఉద్దీపన చర్యల్లో భాగంగా దాదాపు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అంతేకాకుండా వివిధ రంగాల్లో ఎన్నో సంస్కరణల తీసుకొస్తునట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అయితే ఇవన్నీ ఆర్థిక ప్రగతి పై సర్వత్ర ప్రభావం చూపించదని గోల్డ్ మన్ శాక్స్ కు చెందిన ఆర్థిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేసారు.
Tags:    

Similar News