ఏపీ అధికార పార్టీ వైసీపీలో మంత్రి పదవులు దక్కనివారి అసంతృప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. మళ్లీ ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు తెరమీదికి వచ్చాయి. ఇటీవల తన తఢాకా చూపిస్తానంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విశాఖ జిల్లా రిజర్వడ్ నియోజకవర్గం పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు.. తాజాగా మరోసారి వైసీపీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. జగన్‌ను దెబ్బకు దెబ్బ కొడతానంటూ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ``దమ్ముంటే కాస్కో`` అనే విధంగా హైకమాండ్‌కు ఆయన హెచ్చరికలు పంపారు.
అంతేకాదు.. అవసరమైతే.. తనను జైల్లో పెట్టాలంటూ.. వైసీపీ అధిష్టానానికి బాబూరావు సవాల్ చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి దక్కకపోవటంతో తనను నమ్ముకున్న అనేక మంది కార్యకర్తలు నష్టపోయారన్నారు. తాను అమాయకుణ్ణి కాదని.., తన హింసావా దం ఏమిటో తర్వలోనే చూపిస్తానని హెచ్చరించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్ల మండలంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తనకు మంత్రి పదవి దక్కకపోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పదవి దక్కకపోవటంతో తనను నమ్ముకున్న అనేక మంది కార్యకర్తలు నష్టపోయారన్నారు. తాను హింసా వాదిని కాబట్టే జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరానన్నారు. వైసీపీకి, జగన్‌కు దెబ్బకు దెబ్బ కొడతామని.. తన హింసావాదం ఏమిటో త్వరలోనే చూపిస్తానని హెచ్చరించారు. "ఆ బోడి రాజకీ యాలు నాకెందుకయ్యా. ఓ మాట కోసం వైసీపీలో చేరాను. నేను నిజంగా నూటికి లక్ష పర్సెంట్ హింసావా దినే. నేను మీరనుకున్నంత సాఫ్ట్ కాదు. అప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా హింసావాదంతో వైసీపీలో చేరా. బలమైన జాతీయ క్రాంగెస్ పార్టీని కూడా లెక్కచేయలేదు. వీళ్ల కోసం ఇన్ని త్యాగా లు చేస్తే.. నా ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి?`` అని బాబూ రావు వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. రాష్ట్రంలో తన మీద ఎంతోమందికి ఆశలున్నాయన్న ఆయన ``వాళ్లనుకుంటున్నారేమో (వైసీపీ అధిష్టానం).. నేను అమాయకుడిని కాదు. హింసావాదిని. ఈ మాట లక్ష మంది పబ్లిక్ మీటింగ్‌లో చెబుతా. నాకేం భయం లేదు. కావాలంటే జైళ్లో పెట్టమను." అని బాబూరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ఆయన తన అనుచరులతో నాలుగు రోజులకిందట నిర్వహించిన సమావేశంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరింత రెచ్చిపోయారు. మరి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పటి వరకు అలిగిన వారిని తాడేపల్లికి పిలిచి బుజ్జగించిన అధిష్టానం.. బాబూరావును మాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మరింత ఆగ్రహంతో ఉన్నారు. మరి ఇప్పటికైనా.. ఈ అసంతృప్తిని తగ్గించే చర్యలు తీసుకుంటారేమో చూడాలి.
కొసమెరుపు:
గొల్ల బాబూరావు.. చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వైరల్ అయ్యాయి.. అధిష్టానం కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో బాబు రావు తన మాటలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. అంతేకాదు.. తాను జగన్‌కు అత్యంత విధేయుడినని చెప్పుకొచ్చారు. పార్టీకి తాను ఎప్పుడూ.. సేవకుడినేని.. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని.. తనకు ఎలాంటి ఆవేదన లేదన్నారు. అంతేకాదు... కేవలం తన అనుచరుల డిమాండ్‌నే తాను చెప్పానన్నారు.