కరోనా మహమ్మారి తో గత ఏడాది మొత్తం దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దేశంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎన్నో ఊహించని మార్పులు తీసుకువచ్చింది. ఈ మహమ్మారి దెబ్బకి అసలు 2020 ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. ఇదిలా ఉంటే .. ప్రస్తుతం అందరి కళ్లు కూడా వ్యాక్సిన్ పైనే ఉన్నాయి. నూతన సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ పై ఏ నిమిషమైనా గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే వ్యాక్సిన్ అనుమతి కోసం ఆస్ట్రాజెనెకా, సీరమ్ ఇన్సిస్టిట్యూట్ ల కోవీషీల్డ్, ఫైజర్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ లు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. టీకా అత్యవసర వినియోగంపై కమిటీ భేటీ అవుతోంది. సమావేశంలో టీకాకు డీసీజీఐ అత్యవసర అనుమతి ఇస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా టీకా అత్యవసర వినియోగానికి యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు అర్జెంటినా ఇప్పటికే ఆమోదం తెలిపాయి. వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ అనుమతుల కోసం సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, ఫైజర్ లు సమర్పించిన దరఖాస్తులను నిపుణుల కమిటీ ఇప్పటికే పరిశీలించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించి పరీక్షించే ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపై పునః సమీక్షించేందుకు ఇవాళ నిపుణుల కమిటీ సమావేశం కానుంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితం, ప్రభావవంతమైనదని ఈ టీకాకు ఆమోదం తెలిపిన మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ గేమ్ చేంజర్ గా మారనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
యూకేలో బీభత్సం సృష్టిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ పైనా ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయగలదని ఆస్ట్రాజెనెకా ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు భారత్ బయోటెక్ అత్యవసర వినియోగానికి కూడా రేపే అనుమతులు వచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ట్రయల్ ఫలితాలపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సానుకులంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
ఇందులో భాగంగా డిసెంబర్ 28, 29 తేదీల్లో డ్రై రన్ నిర్వహించింది. నాలుగు రాష్ట్రాల్లో ఈ డ్రై రన్ సక్సెస్ అయింది. దీంతో రేపటి నుంచి దేశమంతా డ్రై రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. డ్రై రన్ పూర్తి అవ్వగానే వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది. క్సిన్ ఇచ్చే కేంద్రాలు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించారు. వీటితో పాటు కోల్డ్ స్టోరేజ్ ల నిర్వహణ, రవాణా ఏర్పాట్లు, భౌతిక దూరం పాటించేలా ప్రజలను అదుపు చేసే విధానం అమలును ప్రత్యక్షంగా చూశారు.ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌తో పాటుగా భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఫైజర్ కంపెనీని అదనపు డేటా పంపాలని కేంద్రం కోరింది. ఇక ఈ మూడు వ్యాక్సిన్లపై ఎక్స్‌పర్ట్ కమిటీ కొత్త సంవత్సరం రోజున నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఒక్కదానికే అనుమతి ఇస్తారా లేదా మూడు వ్యాక్సిన్లకి అనుమతి ఇస్తారా అన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది.