కరోనా ప్రభావంతో ఐపీఎల్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. మళ్లీ ఎప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది? అంటూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్ లో ఇప్పటికే కొన్ని మ్యాచ్లు పూర్తయ్యాయి. మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో జరగబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ ఊహాగానాలే నిజమయ్యాయి. ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లను యూఏఈ వేదికగా కొనసాగించబోతున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
గత సీజన్ ఐపీఎల్ కూడా యూఏఈలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం ఐపీఎల్ భారత్ లోనే నిర్వహించారు. కానీ ఐపీఎల్ ప్రారంభమయిన కొద్ది రోజులకే కరోనా కేసులు పెరిగాయి. మరోవైపు కొందరు క్రికెటర్లు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రేక్షకులు లేకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకొని బయోబబల్ పద్ధతిలో ఐపీఎల్ నిర్వహించారు. అయినప్పటికీ ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో ఐపీఎల్ ను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇవాళ బీసీసీఐ ప్రత్యేకంగా సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణపై చర్చించారు. 2021లో ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించబోతున్నట్టు బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ లో కూడా ఓ ప్రకటన చేసింది.
సెప్టెంబర్, అక్టోబర్ లో మిగిలిన మ్యాచ్లు జరగనున్నాయి. ఐపీఎల్ 2021 లో 31 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. కచ్చితమైన తేదీలు ప్రకటించనున్నారు. ఇండియాలో టీ20 ప్రపంచకప్ కూడా జరగాల్సి ఉంది. ఇందుకోసం అన్ని దేశాల జట్లు సిద్ధంగా ఉన్నాయా? తదితర విషయాలపై కూడా బీసీసీపై చర్చిస్తోంది.