క్రికెట్ ప్రేక్షకులకు ఐపీఎల్ శుభవార్త

Update: 2021-09-16 03:52 GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్‌లో కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ఆగిన రెండో సగాన్ని యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా మొదటి సగంలో  స్టేడియంలో మ్యాచ్‌లను చూడటానికి అభిమానులను అనుమతించలేదు. అప్పుడు సెకండ్ వేవ్ దేశంలో ప్రబలడంతో పకడ్బందీగా నిర్వహించారు. అభిమానులు లేకుండానే ఆటగాళ్లు టీ 20 గేమ్‌లు ఆడారు. రెండో సగభాగంలో మాత్రం అభిమానులను ఇప్పుడు స్టేడియంలోకి అనుమతించాలని నిర్ణయించారు.

యూఏఈలో జరిగే రెండో సగం ఐపీఎల్ కు అభిమానులను మళ్లీ స్టేడియాలకు స్వాగతించాలని  బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు నిర్ణయించింది. ఈ నిర్ణయంపై క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో మిగిలిన అన్ని మ్యాచ్‌ల కోసం అభిమానులు స్టేడియంలో ఆటలను చూడవచ్చు. ఈ మేరకు అధికారికంగా ఐపీఎల్ 2021 అధికారులు దీనిని ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేశారు..

"వివో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 ఐదుసార్లు ఛాంపియన్, ప్రస్తుత టైటిల్ హోల్డర్లు ముంబై ఇండియన్స్, మూడు సార్లు ఐపిఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మధ్య సెప్టెంబర్ 19న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో  తిరిగి ఐపీఎల్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ యే తొలి మ్యాచ్. కోవిడ్ -19 పరిస్థితి కారణంగా కొద్ది విరామం తర్వాత ఐపీఎల్ అభిమానులను తిరిగి స్టేడియాలకు అనుమతిస్తున్నాం’ అని ఐపీఎల్ ప్రకటనలో విడుదల చేసింది.

కోవిడ్ ప్రోటోకాల్‌లు, యుఏఇ ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అన్ని మ్యాచ్‌లు దుబాయ్, షార్జా, అబుదాబిలో పరిమిత ప్రేక్షకులతో జరుగుతాయని ఐపీఎల్ పేర్కొంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ ఈనెల 19 న ప్రారంభం కానుంది. అధికారిక వెబ్‌సైట్‌లో మిగిలిన టోర్నమెంట్ కోసం అభిమానులు సెప్టెంబర్ 16 నుంచి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
Tags:    

Similar News