రాష్ట్రంలో మద్యం ప్రియులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకాలం దూరమైపోయిన తమ ఫేవరేట్ బ్రాండ్లు తొందరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు బ్రాండ్ల తయారీదారులకు (డిస్టల్లరీలు) సంకేతాలు పంపారట. తొందరలోనే పాత్ర బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది కాబట్టి ఉత్పత్తికి రెడీగా ఉండమని డిస్టిల్లరీ యజమానులకు కబురు పంపింది.
అన్నీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే రాయల్ స్టాగ్, ఏసీ ప్రీమియం, ఇంపీరియల్ బ్లూ, ఎంసీ బ్రాందీ, ఎంసీ విస్కీ, ఆఫీసర్స్ చాయిస్, ఏసీ బ్లాక్ లాంటి బ్రాందీ, విస్కీతో పాటు బడ్ వైజర్, కింగ్ ఫిషర్, నాకౌట్ లాంటి పాపులర్ బీర్లు కూడా షాపుల్లో కనబడబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాతవి, పాపులర్ బ్రాండ్ల స్ధానంలో కొత్త వాటిని మార్కెట్లోకి తెచ్చారు. అయితే పాత బ్రాండ్లంతగా పాపులర్ కాకపోయినా వేరేదారిలేక జనాలు వీటినే తాగుతున్నారు.
ఇదే విషయమై ప్రతిపక్షాలు ఎంత గోల చేశాయో అందరికీ తెలిసిందే. వెంటనే పాపులర్ బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకురావాలని, ధరలను తగ్గించాలంటూ రాష్ట్రంలో మందు బాబులకు మద్దతుగా ప్రతిపక్షాలు డిమాండ్లు చేశాయి. సరే ఎవరేమనుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకవైపు కొత్త బ్రాండ్లను మార్కెటింగ్ చేస్తునే మరోవైపు వాటి ధరలను విపరీతంగా పెంచేశారు. దీంతో మద్యం ప్రియుల్లో కూడా ప్రభుత్వంపై వ్యవతిరేకత బాగా పెరిగిపోయింది.
అలాంటిది తెరవెనుక ఏమైందో ఏమో హఠాత్తుగా మందుబాబులపై ప్రభుత్వం ప్రేమకురిపించింది. మొదట మద్యం ధరలను తగ్గించింది. ఇపుడేమో పాత, పాపులర్ బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. వీటివల్ల మద్యం ప్రియులకు నిజంగా పండగనే చెప్పాలి. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చినా పాపులర్ బ్రాండ్లు అందుబాటులోకి రావటానికి మాత్రం మరో నెలరోజులు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ధరలు తగ్గటం, ఇష్టమైన బ్రాండ్లు అందుబాటులోకి రావటమంటే మందుబాబులు హ్యాపీయే కదా.