ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. కేసుల సంఖ్య సుమారు 25 లక్షలకు పైగా ఒక్కరోజులోనే నమోదయింది. ఇదే స్థాయిలో మరణాల సంఖ్య కూడా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా , బ్రిటన్ , ఇటలీ లాంటి దేశాల్లో వైరస్ కేసులు గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెప్పారు. అమెరికాలో ఒక్క రోజులోనే సుమారు ఏడు లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు బ్రిటన్, ఇటలీ లో కూడా రెండు లక్షలకు పైగా కేసులు వెలుగు చూసినట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ సామాజిక వ్యాప్తి లో భాగంగా కేసుల సంఖ్య భారీగా వెలుగు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు భారత్లో కూడా కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ ఒక్క రోజు సుమారు 90 వేలకు పైగా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సుమారు 300 మందికి పైగా చనిపోయినట్లు పేర్కొన్నారు.
కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ఈ ప్రభావం అంతర్జాతీయ కంపెనీల పై పడింది. ఐటి ఉద్యోగులు కూడా ఇంటి నుంచి పని కే పరిమితం కావాల్సి వస్తోంది. వైరస్ కేసులు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వెలుగు చూసిన నేపథ్యంలో చాలా ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కరోనా వైరస్ రెండో వేవ్ సమయంలో ఉద్యోగులను పూర్తిస్థాయిలో వర్క్ హోం కి పరిమితం చేస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే పరిస్థితులు కొంత మేర చక్కదిద్దు కున్నాయని భావించిన తరుణంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తిరిగి ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయనున్నట్లు కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. ముందుగా అనుకున్నట్లు చాలా కంపెనీలు జనవరి నుంచి ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని భావించాయి. అయితే వైరస్ విజృంభించడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ కారణంగా కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ని మరికొన్ని రోజులు పొడిగించినట్లు నిర్ణయం తీసుకోగా తాజాగా మరికొన్ని ఐటీ సంస్థలు ఇదే దారిలో నడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
చాలా ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మరో వాదన ముందుకు వచ్చింది. ఇప్పటికే రెండు సంవత్సరాలకు పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడ్డారు. అయితే కరోనా వైరస్ కొత్త వేరియంట్ తో కేసుల సంఖ్య మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల వెల్ బీయింగ్ కోసం కొంత మొత్తాన్ని వెచ్చించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పూర్తి స్థాయిలో తగిన సౌకర్యాలను కల్పించేందుకు మరికొంత డబ్బును ఇవ్వాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియని నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వాల్సిందిగా పలు అంతర్జాతీయ ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి.
కేవలం ఐటి సంస్థలు మాత్రమే కాక ఇతర రంగ సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసులు అమాంతం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనితో పాటే ప్రస్తుతం ఐటి కంపెనీలు అమలు చేస్తున్న హైబ్రిడ్ విధానాన్ని కూడా అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.