జగన్ సర్కార్ కు కేంద్రం అదిరిపోయ శుభవార్త

Update: 2021-01-25 12:50 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం సోమవారం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కష్టకాలంలో ఏపీకి కేంద్రం జీఎస్టీ పరిహార నిధులు విడుదల చేసి ఊరటనిచ్చింది.మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానంతో పలు రాష్ట్రాలు భారీగా నష్టాలు ఎదుర్కొంటున్న విషయం తెలిపిందే.  దీంతో కేంద్రం విడతల వారీగా పరిహారం అందజేస్తోంది.

గత ఏడాది డిసెంబర్ లో జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ పరిహారం అందిస్తోంది.  ఇందులో భాగంగా మరో దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీఎస్టీ విధానంతో పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాల భర్తీకి కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.తెలుగు రాష్ట్రాలకు కేంద్రఆర్థిక శాఖ సోమవారం పరిహారం కింద మొత్తం రూ.3174.15 కోట్లు విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రూ.1810.71 కోట్లు విడుదల చేయగా.. తెలంగాణ రాష్ట్రానికి రూ.1336.44 కోట్లు విడుదల చేసింది.ఇప్పటికే సీఎంజగన్ కేంద్రంలోని పెద్దలను కలిసిన ప్రతిసారి జీఎస్టీ పరిహారం గురించి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్రం ఏపీకి నిధులు విడుదల చేస్తూ ఊరటనిచ్చింది.
Tags:    

Similar News