దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో వ్యక్తిగత వాహనాలు ఉపయోగించడానికి సామాన్యులు జంకుతున్నారు. పబ్లిక్ ట్రాన్సుపోర్టు వైపే మొగ్గు చూపుతున్నారు. ఖర్చు తక్కువ, ప్రయాణం సురక్షితం అనే ఆలోచనతో సొంత వాహనాలను పక్కకు పెట్టేశారు. అయితే భాగ్యనగరంలో సామాన్యులకు మెట్రో మంచి సౌకర్యం. హైదరాబాద్ లో ఉండే ట్రాఫిక్ కష్టాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి కూడా బైకులు, కార్లను ఉపయోగించడం తగ్గించేశారు. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేవారు ఎక్కువగా మెట్రోపైనే ఆధారపడతారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో అసౌకర్యం ఏంటంటే ఉదయం ఏడు తర్వాతే రైళ్లు ప్రారంభమవుతాయి. కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది కాస్త సమస్యే. ఈ అసౌకర్యాన్ని ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతే సమస్యకు పరిష్కారం వచ్చేసింది.
మెట్రో టైమింగ్స్ వల్ల కలిగే అసౌకర్యాన్ని వివరిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దానిని మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. మెట్రో టైమింగ్స్ సమస్యను పరిశీలించిన మంత్రి... దీనిపై పరిష్కారం చూపాలని ఆదేశించారు. హైదరాబాద్ వాసి చేసిన ట్వీట్ దృష్ట్యా... మెట్రో సమయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో-హెచ్ఎంఆర్ వినియోగదారులకు తీపికబురు చెప్పింది. మంత్రి ఆదేశాలతో మెట్రో వెంటనే ఓ సంచలనాత్మక నిర్ణయం ప్రకటించింది. బుధవారం(నవంబర్ 10) నుంచి మెట్రో వేళల్లో మార్పు చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని హెచ్ఎంఆర్ వెల్లడించింది.
మెట్రో రైళ్లు రోజూ ఉదయం 7 గంటల నుంచి మాత్రమే ప్రారంభమవుతున్నాయని ఓ నగరవాసి ట్వీట్ చేశారు. ఫలితంగా ఆఫీసులకు వెళ్లే వారికి ఇబ్బందిగా ఉందని చెప్పారు. పైగా ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సిన వాళ్లు నానా అవస్థలు పడాల్సి వస్తోందని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఉదయం వేళ క్యాబ్ లో వెళ్లాలంటే ఛార్జీలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. తొలి రైలు ఏడు గంటలకు వచ్చేదాకా స్టేషన్లలో ఎదురుచూడాల్సి వస్తోందని తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేసి... సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు. మెట్రో టైమింగ్ పై ఓ సారి దృష్టి పెట్టాలని హైదరాబాద్ మెట్రో-హెచ్ఎంఆర్ కు సూచించారు. అంతే హెచ్ఎంఆర్ మెట్రో సమయాల్లో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
నవంబర్ పది నుంచి ఉదయం ఆరు గంటలకే తొలి మెట్రో రైలు పట్టాలమీదకు రానుంది. వినియోగదారుల సౌలభ్యం దృష్ట్యా ఈ సేవలను హెచ్ఎంఆర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే రాత్రి వేళ 11.15 గంటలకు చివరి మెట్రో ట్రెయిన్ చివరి స్టేషన్ కు చేరుతుందని వెల్లడించింది. చివరి స్టేషన్ నుంచి 10.15 గంటలకు ప్రయాణమైన మెట్రో సేవలు రాత్రి 11.15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే హైదరాబాద్ మెట్రో హెచ్ఎంఆర్ తీసుకున్న ఈ సంచనాత్మక నిర్ణయం నిజానికి చాలామందికి శుభవార్తే. ఓ వైపు చమురు ధరలు, మరోవైపు ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి ఉపశమనం కలిగించే మెట్రో సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా ఉదయం వేళ ఆఫీసులు, విధులకు వెళ్లే నగరవాసులకు సౌకర్యవంతంగా ఉంటుంది.