ఇన్ని రోజులుగా పెట్టుబడుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కొక్కటిగా శుభవార్తలు అందుతున్నాయి. ఇటీవల రెండు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. తాజాగా అమెజాన్ చేయూతనందిస్తోంది. తెలంగాణ చరిత్రలోనే భారీ పెట్టుబడులు సమకూరినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో రూ.20,761 కోట్ల పెట్టుబడులు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ముందుకొచ్చిందని వెల్లడించారు. ఈ పెట్టుబడిని తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పెద్దదిగా కేసీఆర్ స్పష్టం చేశారు.
క్లౌడ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌లో పేరుగాంచిన అమెరికాకు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ హైదరాబాద్‌ను భారత్‌లో తమ రెండో ఏడబ్ల్యూఎస్ రీజియన్‌గా ఎంచుకుంది. ఈ సెంటర్‌ను 2022 ప్రైమరీలోనే అందుబాటులోకి తెస్తామని అమెజాన్ వెల్లడించింది. ఇప్పటికే 2019 ఆగస్టులో అతిపెద్ద గ్లోబల్ క్యాంపస్‌ను నెలకొల్పిన అమెజాన్ తాజాగా మరో భారీ పెట్టుబడికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం శుభపరిణామమని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కంపెనీతో వరుసగా సమావేశాలు నిర్వహించడం వల్లే ఇది సాధ్యపడిందని వెల్లడించారు. అమెజాన్ లాంటి ప్రఖ్యాత సంస్థ తెలంగాణ డేలా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెడుతుండడంతో ఫ్యూచర్‌లోనూ డేటా సెంటర్ల పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారే అవకాశముందని స్పష్టం చేశారు. కాగా.. ఈ డేటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్ ఎకానమీ, ఐటీ రంగం రెట్లు వృద్ధి సాధించనుంది.
ప్రస్తుతం అమెజాన్ ఏర్పాటు చేస్తున్న ఆసియా పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్ ద్వారా వేలాది మంది వెబ్ డెవలపర్లకు, స్టార్టప్‌లకు, ఐటీ కంపెనీలకు లాభం చేకూరనుంది. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈకామర్స్, పబ్లిక్‌సెక్టార్, బ్యాంకింగ్ తదితర రంగాల్లోనూ తమ కార్యకలాపాల విస్తృతి అవకాశం కలుగనుంది. భవిష్యత్తులోనూ డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.