పదోతరగతి విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్

Update: 2021-04-27 15:30 GMT
ఏపీలో కరోనా కల్లోలంగా మారింది. ఈరోజు ఒక్కరోజే కేసులు 11వేలకు చేరుకున్నాయి. మరణాలు అధికమయ్యాయి. అయితే ఇంత కరోనా వేళ కూడా విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీలో కరోనా నేపథ్యంలో సీఎం జగన్ తో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తాజాగా భేటి అయ్యారు.  దూర ప్రాంతాల టెన్త్ విద్యార్థులకు స్థానికంగా  పరీక్ష రాసేలా అనుమతి ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. టెన్త్ విద్యార్థులు స్థానికంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.కరోనా నేపథ్యంలో గ్రామాల్లోని విద్యార్థులకు స్థానికంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని.. వెంటనే అమలు చేయాలని జగన్ సూచించారు.  ఈ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News