పాన్-ఆధార్ లింక్ చేయని వారికి గుడ్ న్యూస్.. గడువు పొడగించిన కేంద్రం

Update: 2021-04-01 05:30 GMT
మీకు పాన్ కార్డు ఉందా? దానిని ఆధార్తో లింక్ చేయలేదా? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. పాన్-ఆధార్ కార్డు లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గడువును పొడగించింది. తొలుత ఆఖరి తేదీని మార్చి 31 వరకు నిర్ణయించగా... ఆ గడువును జూన్ 30 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ లింక్ గడువు పెంచడం వల్ల చాలామందికి ఊరట లభించనుంది. పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఆ కార్డులు పని చేయకపోవడం, లేదా జరిమానాలు విధించడం వంటివి ఉంటాయని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. మార్చి 31 ఆఖరి తేదీ అనుకోని చాలామంది హైరానా పడ్డారు. కానీ కొవిడ్ దృష్ట్యా ఈ గడువును పొడగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ఆధార్-పాన్ లింక్ గడువు పెంచినందున ఈసారి కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పాన్ ఆధార్ కార్డును లింక్ చేయకుంటే ఆదాయపు పన్ను చట్టం 1961, కొత్త సెక్షన్ 234H కింద జరిమానా విధిస్తారు.  గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా ఉంటుంది. పాన్ కార్డు చెల్లుబాటు కాదు.

ఆర్థిక లావాదేవాల కోసం పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డు చెల్లుబాటు కాకపోతే చట్టం ప్రకారం రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. అందుకే పాన్-ఆధార్ అనుసంధానం తప్పని సరి. దీనికోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి లింక్ చేసుకోవచ్చు. చేయాల్సిందల్లా ఆదాయపు పన్ను అధికారిక వెబ్సైట్కు వెళ్లి అనుసంధానం చేస్తే సరి.
Tags:    

Similar News