మద్యం ప్రియులు పండుగ చేసుకోండి.. ఢిల్లీ సర్కార్ లిక్కర్ ప్రియులకు తీపి కబురును అందించింది. ముఖ్యంగా విదేశీ మద్యం ఇష్టపడేవారికి మరింత కిక్కించింది.
తాజాగా ఢిల్లీ సర్కార్ ఎమ్మార్పీ ధరల కంటే 25శాతం తక్కువకే ఫారిన్ మద్యం అందించేందుకు సిద్ధమైంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇవి బయట బార్లు, వైన్స్ లలో దొరకవు. ఎక్సైజ్ శాఖ ఈ బాటిళ్లను అమ్మనుంది.
దేశ రాజధాని కావడంతో ఇక్కడికి విదేశీ మద్యం చాలా మంది తీసుకొస్తుంటారు. ఢిల్లీలో ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో తాజాగా భారీగా ఫారిన్ లిక్కర్ పట్టుబడుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో ప్రతీ ఏటా 2.5 లక్షల ఫారిన్ లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుంటోంది. ఈ సంవత్సరం 15కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసింది. అయితే ఆ బాటిళ్లను స్వాధీనం చేసుకొని పారబోయడమో.. లేదా ధ్వంసం చేయడమో ఇన్నాళ్లు చేసేవారు. అయితే అలా చేసే బదులుగా వాటిని తక్కువ ధరకు అమ్మాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ మద్యాన్ని ల్యాబ్ కు పంపి టెస్ట్ చేశాక 25శాతం తక్కువ ధరలకే అమ్మనుంది.
ఇలా తనిఖీల్లో పట్టుబడ్డ మద్యాన్ని కూడా వృథా చేయకుండా క్యాష్ చేసుకోవాలని కేజ్రీవాల్ సర్కారు కొత్త ప్లాన్ వేసింది. తద్వారా భారీగా ఆదాయం పొందాలని చూస్తోంది.