ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ వరం

Update: 2019-06-08 07:41 GMT
ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు వరం ప్రకటించారు. ఏకంగా రేపటి కేబినెట్ సమావేశం తర్వాత ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతి( ఐఆర్) ను ప్రకటించనున్నట్టు జగన్ ప్రకటించారు. అంతేకాదు.. సీపీఎస్ రద్దుపై ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు. విద్యార్హతను బట్టి పర్మనెంట్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలను పెంచుతామని జగన్ స్పష్టం చేశారు.

సీఎం జగన్ ఏకంగా 27శాతం మధ్యంతర భృతిని ప్రకటించడంపై సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. జగన్ కు ఉద్యోగ సంఘాల నేతలు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఇక జగన్ తనను కలిసి ఉద్యోగులకు మీ సహాకారం కావాలని కోరారు. ముఖ్యమంత్రితో సన్నిహితంగా మెలుగుతామని.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటామని చెప్పుకొచ్చారు..

ఇక జగన్ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను తాను తప్పుపట్టనని హామీ ఇచ్చారు. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా పనిచేసుకొని రాష్ట్రానికి పాటు పడాలని కోరారు.

    

Tags:    

Similar News